Political News

జ‌నంలోనే కేసీఆర్‌… సమరానికి రెడీనా?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్‌.. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఈ నెల 20 నుంచి ఆయ‌న వ‌రుస స‌మావేశాల‌కు హాజ‌రవుతున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. ఈ నెల 20న జ‌గిత్యాల‌లో జ‌ర‌గ‌నున్న భారీ బ‌హిరంగ స‌భ‌కు కేసీఆర్ హాజ‌రువుతున్నారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీకి ఇటీవ‌ల రాజీనామా చేసిన జీవ‌న్ రెడ్డిని పార్టీ లో చేర్చుకోనున్నారు. ఈ సంద‌ర్భంగానే భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ స‌భ‌కు సంబంధించిన ఏర్పాట్ల‌ను తాజాగా మాజీ మంత్రులు కేసీఆర్‌, హ‌రీష్‌రావులు ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా హ‌రీష్‌రావు మాట్లాడుతూ.. స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఇక నుంచి కేసీఆర్ ప్ర‌జ‌ల్లోనే ఉండ‌నున్నార‌ని.. ప్ర‌భుత్వ అవినీతిని.. ముఖ్య‌మంత్రి నిద్ర‌మ‌త్తును కూడా వ‌దిలిస్తార‌ని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పైనా కేసీఆర్ స్పందిస్తార‌న్నారు. కేసీఆర్ జ‌గిత్యాల‌కు వ‌స్తుంటే.. అదే రోజు సీఎం రేవంత్ రెడ్డి .. ఉద్దేశ పూర్వ‌కంగా మేడిగ‌డ్డ‌కు పోతున్నార‌ని వ్యాఖ్యానించారు. అక్క‌డేదో జ‌రిగిపోయిన‌ట్టుగా ఆయ‌న ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తాన‌ని చెబుతున్నార‌ని విమ‌ర్శించారు. ఇక‌, త‌మ స‌భ పెట్టుకున్న రోజునే ఇక్క‌డ ర‌హ‌దారుల నిర్మాణం చేప‌ట్ట‌డం వెనుక ప్ర‌భుత్వ కుట్ర ఉంద‌ని దుయ్య‌బ‌ట్టారు.

కేసీఆర్ సెంటిమెంటు పారేనా?

కేసీఆర్ అంటేనే తెలంగాణ ప్ర‌జ‌ల‌కు పెద్ద సెంటిమెంటు. గ‌త 2023 ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం పాలైనప్ప‌టికీ.. ఆయ‌న సెంటిమెంటు కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రావాల‌ని నిర్ణ‌యించ‌డం..వ‌రుస‌గా స‌భ‌లు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించ‌డం వెనుక ఆ సెంటిమెంటును రాజేయాల‌ని చూస్తున్నారు. కానీ, మ‌రోవైపు.. ఆయ‌న కుమార్తె క‌విత‌.. ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ప‌ది సంవ‌త్స‌రాలు ప్ర‌జ‌ల‌ను విస్మ‌రించారు కాబ‌ట్టే.. ఇప్పుడు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నార‌ని..ఆమె కేటీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించినా.. అది కేసీఆర్‌కు కూడా త‌గులుతోంది.

అయితే.. కేసీఆర్ ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రావ‌డం ప్రారంభ‌మైతే.. త‌మ‌కు తిరుగు ఉండ‌ద‌ని పార్టీ నాయ‌కులు అంచ‌నా వేస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. గ‌త 2023 ఎన్నిక‌ల త‌ర్వాత‌.. అటు అసెంబ్లీకి.. ఇటు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు కూడా కేసీఆర్ రావ‌డం మానేశారు. అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో తొలి ఏడాది.. ఆయ‌న ఫాం హౌస్‌కే ప‌రిమితం అయ్యారు. దాదాపు రెండేళ్ల‌కుపైగానే ఇంటికే ప‌రిమితం అయిన కేసీఆర్ .. ఇప్పుడు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రావ‌డం త‌మ‌కు క‌లిసి వ‌స్తుంద‌ని బీఆర్ ఎస్ అంచ‌నా వేస్తుండ‌గా.. కేసీఆర్ ప‌దేళ్ల పాల‌న ప్ర‌జ‌లు ఇంకా మ‌రిచిపోలేద‌ని.. కాంగ్రెస్ చెబుతోంది.

This post was last modified on April 19, 2026 12:05 am

Share

Recent Posts

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

1 hour ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

3 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

3 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

4 hours ago

తమిళ రాజకీయాల్లోకి ఇంకో స్టార్?

జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…

4 hours ago

ట్రెండింగ్ సాంగ్ ‘జిలేబి’ని ఎవరు వాడుకుంటారో

ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…

5 hours ago