Political News

మృత్యుంజయురాలి పునర్జన్మ… మాట నిలబెట్టుకున్న లోకేష్

ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి పునర్వికకు కొత్త జీవితం లభించింది. మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకుని, ఆమెకు అత్యంత ఖరీదైన ప్రాణరక్షక ఇంజెక్షన్ అందించి చికిత్సను విజయవంతంగా పూర్తి చేయించారు. వెన్నెముక కండరాల క్షీణత వ్యాధి అయిన స్పైనల్ మాస్క్యూలర్ ఆంట్రోఫీ తో బాధపడుతున్న పునర్వికకు రూ.16 కోట్ల విలువైన ‘జోల్జెన్స్‌మా’ ఇంజెక్షన్ ఇవ్వడంతో ప్రాణాపాయం తప్పింది.

చికిత్స కోసం ప్రజలు ముందుకు వచ్చి సుమారు రూ.10 కోట్లు సమకూర్చగా, మిగిలిన రూ.6 కోట్ల కోసం ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులకు లోకేష్ అండగా నిలిచారు. అవసరమైన మొత్తాన్ని తానే ప్రభుత్వం తరుపున భరిస్తానని హామీ ఇచ్చి, విదేశాల నుంచి ఇంజెక్షన్ తెప్పించారు. హైదరాబాద్‌లోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో వైద్యులు సకాలంలో చికిత్స అందించడంతో చిన్నారి ప్రాణాలు కాపాడబడ్డాయి.

పెరుగుదలను అడ్డుకుంటూ తీవ్ర ఇబ్బందులకు గురిచేసే ఈ అరుదైన వ్యాధి నుంచి విముక్తి పొందిన పునర్విక మృత్యుంజయురాలిగా నిలిచింది. ప్రజల సహకారం వృథా కాకుండా స్వయంగా పర్యవేక్షిస్తూ చికిత్స జరిగేలా లోకేష్ చర్యలు తీసుకోవడం విశేషంగా నిలిచింది.

“ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం నా బాధ్యత. పునర్విక కోసం చేసిన వాగ్దానం నెరవేరింది” అని లోకేష్ పేర్కొన్నారు. చిన్నారి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. చిన్నారి పునర్వికకు ఇది పునర్జన్మలాంటి క్షణంగా కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.

This post was last modified on April 18, 2026 4:45 pm

Share

Recent Posts

కమల్ కోసం రజినీ త్యాగం?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…

2 hours ago

‘కామ్రేడ్ కళ్యాణ్’ను కాపాడిన మెగాస్టార్

ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…

2 hours ago

కోన వెంకట్ భాషలో ‘క్రిమినల్స్’ ఎవరు

నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…

4 hours ago

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…

6 hours ago

విజయ్ చెప్పింది ప్రాక్టికల్‌గా సాధ్యమేనా

రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…

6 hours ago

జంతర్ మంతర్… కేసీఆర్ ముందే పసిగట్టారా?

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…

8 hours ago