Movie News

విష్ణుప్రియ అయిపోయింది… ఇక అనన్య

ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఫాలోయింగ్ అన్న అమ్మాయిలు.. పెయిడ్ సబ్‌స్క్రిప్సన్లు పెట్టి ఆ యూజర్లకు ఎక్స్‌క్లూజిక్ హాట్ కంటెంట్ ఇవ్వడం ద్వారా లక్షలు సంపాదించడం ఇప్పుడు ట్రెండుగా మారిన సంగతి తెలిసిందే. సినీ, టీవీ రంగానికి చెందిన మహిళలు ఒక్కొక్కరుగా ఇందులోకి అడుగు పెడుతున్నారు.

ఇది కొన్నేళ్లుగా నడుస్తున్న వ్యవహారమే అయినా.. ఇందులో ఇల్లీగల్ ఏమీ లేకపోయినా.. ‘బిగ్ బాస్’ ఫేమ్ విష్ణుప్రియ భీమినేనిని ఈ మధ్య కొందరు అదేపనిగా టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
యువత బలహీనతలను సొమ్ము చేసుకుంటూ విష్ణుప్రియ లక్షలు సంపాదిస్తోందని.. ఆమెపై చర్యలు చేపట్టాలని.. తన అకౌంట్ బ్లాక్ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొన్ని రోజులు దీని గురించి చర్చ జరిగింది.

ఐతే ఈ వ్యవహారంలో పోలీసులు చేసేదేమీ లేదన్నది స్పష్టం. ఈ కేసు, సోషల్ మీడియా ట్రయల్ పుణ్యమా అని విష్ణుప్రియకు ఒక్కసారిగా పెయిడ్ ఫాలోవర్లు మూడింతలు కావడం విశేషం. నెలకు ఏడెనిమిది లక్షలున్న ఆదాయం కాస్తా.. రూ.20 లక్షలకు చేరుకుంది.

ఐతే విష్ణుప్రియను ఏమీ చేయలేకపోయినా సోషల్ మీడియా జనాలు.. ఇప్పుడు ఇంకో తెలుగమ్మాయిపై పడ్డారు. మల్లేశం, వకీల్ సాబ్, పొట్టేల్ సహా పలు చిత్రాల్లో నటించి గుర్తింపు సంపాదించిన అనన్య నాగళ్ళ కూడా తన సోషల్ మీడియా అకౌంటును పెయిడ్ సబ్‌స్క్రిప్షన్లోకి మార్చిందంటూ సోషల్ మీడియాలో వైరల్ చేయడం మొదలుపెట్టారు. ఆమెకు ఇప్పటికే 600 మంది దాకా ఫాలోవర్లు ఉన్నారు.

దీంతో ఒక్కో సబ్‌స్క్రిప్షన్ మీద రూ.399 చొప్పున ఆమె నెలకు ఎంత సంపాదిస్తుందో లెక్కలు వేస్తున్నారు నెటిజన్లు. దీని గురించి సోషల్ మీడియా చర్చలు, విమర్శలు ఊపందుకున్నాయంటే ఆటోమేటిగ్గా అనన్యకు కూడా ఫాలోవర్లు పెరగడం ఖాయం. అనన్య కూడా ఈ మధ్య పర భాషా కథానాయికలకు దీటుగా గ్లామర్ డోస్ పెంచుతోంది. ఫాలోవర్లు పెరిగే కొద్దీ.. సినిమాల సంగతెలా ఉన్నా ఈ సబ్‌స్క్రిప్షన్లతోనే మంచి ఆదాయం సంపాదించడానికి అవకాశముంది.

This post was last modified on April 18, 2026 4:51 pm

Share

Recent Posts

నాని వాళ్ళని ఎప్పటికీ వదలడు

నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఒక‌ప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్కువ‌గా ఫ్యామిలీ ట‌చ్ ఉన్న…

2 hours ago

డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవాడ్ని

నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…

5 hours ago

ప్యార‌డైజ్ ద‌ర్శ‌కుడు రాజమౌళి ద‌గ్గ‌ర చేరతాడ‌ట‌

ఇండియాస్ నంబ‌ర్ వన్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేయాల‌ని కాబోయే డైరెక్ట‌ర్ కావాల‌నుకున్న ప్ర‌తి వ్య‌క్తికీ…

5 hours ago

ట్రైలర్ లేకపోవడం ఎంత వరకు సేఫ్

అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…

7 hours ago

ఇంద్ర చూపిన దారిలో మిగిలినవీ రావాలి

తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…

9 hours ago

అసలు భయాన్ని థియేటర్‌లో చూపిస్తారేమో

ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…

10 hours ago