Political News

కవిత ఫస్ట్ టార్గెట్ కారు వీరులే

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నోట నుంచి వస్తున్న వ్యాఖ్యలు… తాను వదిలేసి వచ్చిన బీఆర్ఎస్ లో అంతకంతకూ టెన్షన్ పుట్టిస్తున్నాయి. బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా ఉండగా… ఆ పార్టీతోనే రాజకీయ రంగ ప్రవేశం చేసిన కవిత… తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అడుగు జాడల్లో నడిచారు.

అయితే ఇప్పుడు తండ్రి పార్టీకే పోటీ అంటూ కవిత చేస్తున్న వ్యాఖ్యలు నిజంగానే కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే తాను కొత్త పార్టీని పెడుతున్నానని ప్రకటించిన కవిత… తన ఫస్ట్ టార్గెట్ బీఆర్ఎస్సేనని సంచలన కామెంట్స్ చేశారు. ఈ మేరకు శుక్రవారం మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ పుట్టిస్తున్నాయి

తన పార్టీ తెరంగేట్రం తర్వాత తన తొలి టార్టెగ్ బీఆర్ఎస్సేనని కవిత అన్నారు. బీఆర్ఎస్ కు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే తనను కలిశారని ఆమె చెప్పారు. అయితే తనను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరన్న విషయాన్ని తాను ఇప్పుడప్పుడే వెల్లడించబోనని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికీ చాలా మంది బీఆర్ఎస్ మాజీలు తనను కలుస్తూనే ఉన్నారని ఆమె తెలిపారు. తాను పార్టీని ప్రకటించగానే… తనను కలిసిన బీఆర్ఎస్ నేతలంతా తన పార్టీలోకే వస్తారని కూడా ఆమె తెలిపారు.

ఇక తన సోదరుడు, బీఆర్ఎష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గురించి కూడా ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో తాను పాదయాత్ర చేస్తానని ఇటీవలే కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావించిన కవిత… అధికారంలో ఉన్న పదేళ్లు కేటీఆర్ ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని ఆమె విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అధికారం లేకపోయేసరికి ప్రజలు గుర్తుకు వచ్చారని, ఈ క్రమంలో ఆయన ప్రజలను కలుసుకునేందుకు పాదయాత్ర అంటూ బూటకపు మాటలు చెబుతున్నారని ఆరోపించారు. 

ఇక రాజకీయాల్లో తన తొలి ప్రత్యర్ధి బీఆర్ఎస్సేనని చెప్పిన వైనానికి గల కారణాలను కూడా కవిత తనదైన శైలిలో వివరించే యత్నం చేశారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కారణంగానే తాను తన తొలి రాజకీయ ప్రత్యర్థిగా బీఆర్ఎస్ ను ఎంచుకున్నానని తెలిపారు. ఈ విషయంలో తనలో ఎలాంటి మార్పు రాబోదని ఆమె వెల్లడించారు. ఈ నెల 25న తన పార్టీ పేరుతో పాటు పార్టీ సిద్ధాంతాలను ప్రకటిస్తానని కవిత గత నెలలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి కవిత పార్టీ ప్రారంభం అయిన తర్వాత బీఆర్ఎస్ ఎంతగా ఇబ్బంది పడుతుందన్నది చూడాలి.

This post was last modified on April 17, 2026 9:49 pm

Share

Recent Posts

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

1 hour ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

2 hours ago

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…

3 hours ago

అక్టోబర్ మార్కెట్… ఎవరెవరికి జాక్‌‌పాట్

కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…

3 hours ago

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

4 hours ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

4 hours ago