Movie News

మాట తప్పినా హిట్ కొడితే చాలు

టాలీవుడ్ స్టార్ హీరోలు స్టేజ్ ఎక్కితే చాలు, ఇకపై ఏడాదికి రెండు మూడు సినిమాలు పక్కా అని ఫ్యాన్స్‌కు హామీ ఇచ్చేస్తుంటారు. సినిమా ఆలస్యం కావడంతో కాస్త అసహనంగా ఉన్న అభిమానులను కూల్ చేయడానికి ఈ స్పీడ్ మంత్రం బాగానే పనిచేస్తుంది. కానీ గ్రౌండ్ లెవల్లో పరిస్థితి చూస్తే మాత్రం ఆ మాటలు నీటి మూటలనే మిగులుస్తున్నాయి. సినిమా మేకింగ్ స్టైల్ మారడం, విజువల్స్ కోసం ఏళ్ల తరబడి టైం తీసుకోవడం వల్ల హీరోలు చెప్పిన టైమ్‌లైన్స్ అన్నీ తలకిందులవుతున్నాయి.

ఆర్‌ఆర్ఆర్ తర్వాత రెండేళ్లలో మూడు సినిమాలు చేస్తానని రామ్ చరణ్ మాటిచ్చారు. కానీ ఆ సినిమా వచ్చి నాలుగేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు ‘గేమ్ ఛేంజర్’ తప్ప మరో రిలీజ్ లేదు. అది కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో మెగా ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఒక సినిమా రిజల్ట్ తేడా కొడితే, నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో హీరోలు మరింత జాగ్రత్త పడుతున్నారు. అందుకే పెద్ది సినిమా కోసం చాలా టైం తీసుకుంటున్నారు.

ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. పుష్ప 2 తర్వాత ఏడాదికి రెండు సినిమాలు చేస్తానని ఫ్యాన్స్‌కు మాటిచ్చారు. ఆ సినిమా భారీ సక్సెస్ సాధించినప్పటికీ, అట్లీ సినిమాతో పాటు ఇతర ప్రాజెక్టులు పట్టాలెక్కడానికి చాలా సమయం పడుతోంది. పుష్ప 2 వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తున్నా, బన్నీ నుంచి కొత్త సినిమా అప్‌డేట్ తప్ప రిలీజ్ ముచ్చట కనిపించడం లేదు. రిస్క్ చేయడం కంటే పక్కా కంటెంట్‌తో రావడం మేలనేది ఆయన ఆలోచన.

ప్రభాస్ మాత్రం ఈ విషయంలో మిగతా హీరోల కంటే కాస్త బెటర్ అని చెప్పాలి. ఆదిపురుష్ సమయంలో ఏడాదికి రెండు సినిమాలు ఇస్తానని చెప్పిన డార్లింగ్, అన్నట్టుగానే సలార్, కల్కి వంటి భారీ చిత్రాలను బ్యాక్ టు బ్యాక్ థియేటర్లలోకి తెచ్చారు. అయితే ‘రాజా సాబ్’ వల్ల బ్రేక్ పడినా వరుసగా ప్రాజెక్టులను లైన్లో పెడుతూ ప్రభాస్ తన మాటను నిలబెట్టుకోవడానికి గట్టిగానే ట్రై చేస్తున్నారు.

హీరోలకు స్పీడ్ పెంచాలని ఉన్నా, నేటి తరం ఆడియన్స్ టేస్ట్ వారిని అడ్డుకుంటోంది. ఒకప్పుడు రెండు ఫైట్లు, మూడు పాటలు ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు సినిమా 80 శాతం నచ్చితేనే థియేటర్లకు జనం వస్తున్నారు. కంటెంట్ ఏమాత్రం తేడా కొట్టినా సోషల్ మీడియా ట్రోలింగ్ దారుణంగా ఉంటోంది.

అందుకే తొందరపడి సినిమాలు రిలీజ్ చేసి డిజాస్టర్లు మూటగట్టుకోవడం కంటే, లేట్ అయినా లేటెస్ట్ గా రావడం మిన్న అనే ధోరణిలో మన స్టార్స్ ఉన్నారు. సినిమా బాగుంటే అది ఎంత లేట్ గా వచ్చినా ప్రేక్షకులు ఎగబడి చూస్తారు.

కంటెంట్ హిట్టయితే పాత మాటలు, ప్రామిస్‌లు ఎవరూ గుర్తుపెట్టుకోరు అనేది వాస్తవం. అందుకే మన హీరోలు కూడా మాట తప్పినా హిట్ కొడితే చాలు అన్నట్లుగా సైలెంట్ గా తమ పని కానిచ్చేస్తున్నారు. ఈ వెయిటింగ్ పీరియడ్ లో ఫ్యాన్స్ సహనానికి పరీక్ష ఎదురవుతున్నా, బాక్సాఫీస్ వద్ద పక్కా రిజల్ట్ రావాలంటే ఈ మాత్రం టైం తప్పదు మరి.

This post was last modified on April 17, 2026 10:48 am

Share

Recent Posts

నవంబర్ నెలలో ఇంత రష్ ఏంటయ్యా

మాములుగా బాక్సాఫీస్ లెక్కల్లో నవంబర్ నెలని డ్రైగా భావిస్తారు. కారణం భారీ కలెక్షన్లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దీపావళి…

21 minutes ago

స్థానికం `హోరాహోరీ`.. స‌ర్వేల లెక్క‌లివే… !

ఏపీలో జ‌రుగుతున్న స్థానిక ఎన్నిక‌ల్లో వైసీపీ వ‌ర్సెస్ కూట‌మి పార్టీల మ‌ధ్య పోరు ఎలా ఉంటుంది? అనేది ఆస‌క్తిగా మారింది.…

1 hour ago

ప‌వ‌న్ చెప్పింది అర్ధ‌మైందా జ‌గ‌న్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను ఉద్దేశించి జ‌న‌సేన పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి.…

3 hours ago

జగన్ కంచుకోట బద్దలు

రాజ‌కీయం అంటే ఇంతే!.. ఊహించ‌ని ప‌రిణామాలు జ‌ర‌గ‌డ‌మే అస‌లైన రాజ‌కీయం. ఎట్టి ప‌రిస్థితిలోనూ ఎక్కడా ఏక‌గ్రీవాలు కారాద‌ని.. ఎక్క‌డా పోటీ…

9 hours ago

జైలు నుంచి పారిపోయి డ్రోన్లకు చిక్కారు

ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 17 మంది ఖైదీలు జైలు నుంచి పారిపోవడం తమిళనాడులో సంచలనం సృష్టిస్తుంది. ఒకేసారి…

13 hours ago

బాక్సాఫీసుని టెన్షన్ పెడుతున్న అర్నబ్

ముందే హెచ్చరిక ఉన్నప్పటికీ ప్రకృతిని పూర్తిగా ఎదురుకోవడం అంత సులభం కాదు. ప్రస్తుతం రాజమండ్రి, కాకినాడ కేంద్రంగా ముంచేస్తున్న అర్నబ్…

13 hours ago