దేశమంతా ఆసక్తిగా ఎదురు చూసిన నియోజకవర్గాల పునర్విభజన, మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లకు ఉద్దేశించిన బిల్లులకు పార్లమెంటులో చుక్కెదురైంది. డీలిమిటేషన్, మహిళా బిల్లులకు ఆమోదం కోసం గురువారం నుంచి పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశం అయిన సంగతి తెలిసిందే. గురు, శుక్రవారాల్లో ఈ బిల్లులపై లోక్ సభలో సుదీర్ఘ చర్చ జరగగా… శుక్రవారం రాత్రి బిల్లులపై ఓటింగ్ జరిగింది. మూడింట రెండు వంతుల మెజారిటీ దక్కాల్సి ఉండగా… అంతకంటే తక్కువ మంది ఎంపీలు మాత్రమే బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. ఫలితంగా పార్లమెంటులో దిగువ సభ అయిన లోక్ సభలోనే ఈ బిల్లులు వీగిపోయాయి.
మహిళా బిల్లుకు దాదాపుగా అన్ని పార్టీలు సుముఖంగానే ఉన్నా… ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి చివరి క్షణంలో తన వైఖరిని మార్చుకుంది. మహిళా బిల్లుకు తాము అనుకూలమేనని కాంగ్రెస్ అగ్ర నేత, లోక సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన బిల్లుతో దానిని ముడిపెట్టడాన్ని తాము అంగీకరించబోమని ఆయన తెగేసి చెప్పారు. అయితే 2023లోనే మహిళా బిల్లుకు ఆమోదం లభించినా…మరోమారు ఆ బిల్లును సభలో ప్రవేశపెట్టిన తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ బిల్లుతో సంబంధం లేకుండా మహిళా బిల్లుకు ఆమోదం తెలిపేందుకు తమకేమీ అభ్యంతరం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు.
ఇక డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి విపక్షాలు పలు అంశాలను లేవనెత్తాయి. జనాభా లెక్కల అధారంగా చేసే నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదితో పాటు ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని విపక్షాలు గళం విప్పాయి. అధికార ఎన్డీఏ చెబుతున్నట్లుగా ప్రతి రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలకు 50 శాతం మేర నియోజకవర్గాలను పెంచుతామని మాటమాత్రంగా చెప్పడం కాదన్న విపక్షాలు… ఆ విషయాన్ని బిల్లులో ప్రధానంగా ప్రసజ్తావించాలని డిమాండ్ చేశాయి.
ఈ రెండు బిల్లులపై అదికార విపక్షాల మధ్య వాదోపవాదాలు కొనసాగగా… సాయంత్రం 4 గంటలకు జరగాల్సిన ఓటింగ్ రాత్రి 7.30 గంటలకు జరిగింది. ఓటింగ్ జరిగే సమయంలో సభలో 489 మంది ఎంపీలు ఉండగా… వారంతా బిల్లుపై జరిగిన ఓటింగ్ లో పాలుపంచుకున్నారు. బిల్లులకు అనుకూలంగా 278 మంది ఎంపీలు, వ్యతిరేకంగా 211 మంది ఎంపీలు ఓటు వేశారు. బిల్లులు పాస్ కావాలంటే… సభకు హాజరైన సభ్యుల్లో మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. అయితే కేవలం 278 మంది ఎంపీలు మాత్రమే బిల్లులకు మద్దతు పలికిన నేపథ్యంలో బిల్లులు రెండూ వీగిపోయినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
This post was last modified on April 17, 2026 9:02 pm
దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…
లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…