Movie News

పూర్తిగా రెహమాన్ మీదికి నెట్టేయడం భావ్యమా?

అనుకున్నట్లే తెలుగులో మరో భారీ చిత్రం.. మరోసారి రిలీజ్ డేట్ మార్చుకుంది. మార్చి చివరి వారం నుంచి ఏప్రిల్ 30కి వాయిదా పడ్డ రామ్ చరణ్ మూవీ ‘పెద్ది’.. తాజాగా జూన్‌కు వాయిదా పడింది. ఈ సినిమా రెండోసారి పోస్ట్ పోన్ అవుతోందన్న వార్తలు మూడు వారాల ముందే మొదలయ్యాయి. అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం అయింది. ఐతే వాయిదాకు కారణం సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అంటూ సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా అదే పనిగా పోస్టులు వేస్తున్నారు. 

ఇది కావాలని చేస్తున్న ప్రచారమా అనే సందేహాలు కలుగుతున్నాయి. రెహమాన్ ఉండేది ఇక్కడ కాదు. సోషల్ మీడియా వార్తలను, ప్రచారాలను ఆయన పెద్దగా పట్టించుకోడు. పైగా రెహమాన్ ఎప్పుడూ కొంచెం లేటే అనే ముద్ర ఎలాగూ ఉంది. కాబట్టి సింపుల్‌గా వాయిదా నెపాన్ని ఆయన మీదికి తోసేస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

మధ్యలో రంజాన్ మాసం వల్ల రెహమాన్‌ కొంచెం బ్రేక్ తీసుకున్నాడు. మరోవైపు ‘రామాయణ’ లాంటి పెద్ద సినిమాకూ రెహమాన్ పని చేస్తున్నాడు. ఇవి వాస్తవాలే అయినా.. తన కెరీర్లోనే అత్యంత వేగంగా పని చేస్తున్న సినిమాల్లో ‘పెద్ది’ ఒకటి అన్నది తన సన్నిహిత వర్గాల సమాచారం.

ఐతే ఆయన కొంచెం ముందుగా ఔట్ పుట్ తన చేతిలో ఉండాలని కోరుకుంటారు. కానీ ‘పెద్ది’ టీం ఆ పని చేయలేకపోయింది. ఏప్రిల్ 30న రిలీజ్ అంటే రెహమాన్ తన పని పూర్తి చేసేవాడా కాదా అన్నది అనుమానమే. కానీ రెహమాన్ వైపు వర్క్ పూర్తయినా.. ‘పెద్ది’ సినిమా ఏప్రిల్ 30కి రెడీ అయ్యేది కాదన్నది స్పష్టం. 

ఈ సినిమాకు సంబంధించి గ్రాఫిక్ వర్క్ చాలా పెండింగ్ ఉంది. సినిమాలో కీలక సన్నివేశాలకు సంబంధించి ఆ పని సమయానికి పూర్తి కాదనే ముందుగా వాయిదా ఆలోచన చేశారు. ఆ పని పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ అవగొట్టి, పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్ చేసి సినిమాను రిలీజ్ చేయడానికి చాలా టైం పట్టేలా ఉండడంతోనే వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు.

ఆలస్యానికి రెహమాన్ కూడా ఒక కారణం అయితే కావచ్చు కానీ.. ఆయనే కారణం అన్నది మాత్రం వాస్తవం కాదు. కానీ తమ మీద వ్యతిరేకత రాకుండా.. బుచ్చిబాబు అండ్ టీం హమాన్ మీదికి నెపాన్ని నెట్టేసి తాము సేఫ్ అయిపోవాలని చూస్తోందా అనే చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో.

This post was last modified on April 18, 2026 9:37 am

Share

Recent Posts

సైలెంటుగా వ‌చ్చి ఇండ‌స్ట్రీ హిట్ కొట్టేసింది

నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమ‌మ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన న‌టుడు. ఆ…

2 hours ago

ముఖ్యమంత్రి పదవికి దీప్కే రాజీనామా

అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…

6 hours ago

కొండా సురేఖకు కేబినెట్ హోదా?

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…

7 hours ago

ఇరుముడి న‌టుడు… రోజుకు 40 వేలు

హీరో హీరోయిన్ల‌కు.. పెద్ద టెక్నీషియ‌న్ల‌కు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోష‌కాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసేవాళ్ల‌కు…

8 hours ago

నాలుగు స్థంభాలాటలో విజేత ఎవరంట

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…

9 hours ago

కీర్తి సురేష్ ఇంత హాటైపోయిందేంటబ్బా..

మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…

9 hours ago