Political News

మ‌త ప‌ర‌మైన రిజ‌ర్వేష‌న్లు ఉంటాయా?

మ‌త‌ప‌రంగా రిజ‌ర్వేష‌న్ల‌ను క‌ల్పించేది లేద‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పార్ల‌మెంటులో తెగేసి చెప్పారు. మ‌హిళా బిల్లు స‌హా.. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న అంశంపై శుక్ర‌వారం సాయంత్రం ఏక‌బిగిన గంటా 40 నిమిషాల పాటు మాట్లాడిన ఆయ‌న కాంగ్రెస్ పార్టీ విధానాల‌ను.. ఆ పార్టీ ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన వ్య‌వ‌హారాల‌ను తూర్పార‌బ‌ట్టారు. “త‌న మిత్ర‌ప‌క్షాల‌ను బుజ్జ‌గించేందుకు కాంగ్రెస్ పార్టీ మ‌త‌ప‌ర‌మైన రిజ‌ర్వేష‌న్ల‌ను తీసుకురావాల‌ని భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీలా మేం చేయం. మ‌త‌ప‌ర‌మైన రిజ‌ర్వేష‌న్ల‌కు రాజ్యాంగంలో చోటులేదు“ అని షా వివ‌రించారు.

మ‌ల్కాజ్‌గిరి.. గోడు విన‌రా?

ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని మ‌ల్కాజిగిరి నియోజ‌క‌వ‌ర్గాన్ని అమిత్ షా ప్ర‌స్తావించారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఏకంగా 38 ల‌క్ష‌ల మందికి పైగాప్ర‌జ‌లు ఉన్నార‌ని.. వారికి ఒకే ఒక్క ఎంపీ ఉన్నార‌ని..వారి స‌మ‌స్య‌లు వినేందుకు ఎంపీకి ఎంత స‌మ‌యం ప‌డుతుందో ఆలోచించుకోవాల‌ని వ్యాఖ్యానించారు. ఇప్పుడు చేప‌డుతున్న డీలిమిటేష‌న్ ద్వారా.. ఈ నియోజ‌క‌వ‌ర్గం రెండుగా మారుతుంద‌ని..త‌ద్వారా.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌ట్టించుకునేందుకు ఎంపీల‌కు చేరువ‌య్యేందుకు అవ‌కాశం ఉంటుంద‌న్నారు. అలానే.. త‌మిళ‌నాడు, ఏపీలోనూ ఇదే త‌ర‌హా నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయ‌న్నారు. వాటిని రెండుగా చేస్తే పోయేదేంట‌న్నారు.

పీవీని వ‌దిలేశారు..

త‌న ప్ర‌సంగంలో కాంగ్రెస్‌పై విమర్శ‌లు గుప్పించిన షా.. పీవీ న‌ర‌సింహారావును ప్ర‌ధాని చేశారే త‌ప్ప‌.. ఏనాడైనా..ఆయ‌న‌ను మ‌నిషిగా చూశారా? అని ప్ర‌శ్నించారు. “అధ్య‌క్షా.. ఇంత‌క‌న్నా ఎక్కువ చెప్పాల‌ని ఉంది. కానీ, చెబితే.. వారు(కాంగ్రెస్‌) ఓర్చుకోలేరు“ అని వ్యాఖ్యానించారు. ఇక‌, గ‌తంలోనే మ‌హిళా బిల్లులు తీసుకురావాల‌ని ప్ర‌య‌త్నం చేశామ‌ని అంటున్న కాంగ్రెస్ పార్టీ.. వాటిని వ‌దిలించుకునే ప్ర‌య‌త్న‌మే చేసింద‌న్నారు. పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల్లోనూ ఆమోదించుకోవ‌డంలో విఫ‌ల‌మైంద‌న్నారు. గ‌తి లేక‌, ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఛీత్క‌రిస్తార‌న్న ఉద్దేశంతోనే 2023లో మోడీ ప్ర‌వేశ పెట్టిన బిల్లుకు మ‌ద్ద‌తు ఇచ్చింద‌ని ఎద్దేవా చేశారు.

డీలిమిటేష‌న్‌..

డీలిమిటేష‌న్ ప్ర‌క్రియ‌ను గ‌తంలో ఇందిరాగాంధీనే విస్మ‌రించార‌ని ఎదురుదాడి చేశారు. అనేక క‌మిటీలు వేసినా.. వాటి నివేదిక‌ల‌ను తొక్కిపెట్టార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నాడు మ‌న్మోహ‌న్ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ఇచ్చిన పార్టీలే.. మ‌హిళా బిల్లును వ్య‌తిరేకించిన‌ప్పుడు.. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశ పూర్వ‌కంగానే మౌనం పాటించింద‌ని ఎద్దేవా చేశారు. ఆరు నూరైనా.. 2029 ఎన్నిక‌ల నుంచే ఈ రిజ‌ర్వేష‌న్‌ను అమ‌లు చేస్తామ‌ని లోక్‌స‌భ‌లో ఉద్ఘాటించారు. కానీ మెజారిటీ ఓట్లు రాకపోవడంతో బిల్లు పాస్ అవ్వలేదు.

This post was last modified on April 17, 2026 8:31 pm

Share

Recent Posts

ట్విస్టులు ఆర్టిఫీషియల్ ఉంటే ఎలా

హిందీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల వసూళ్లు 270 కోట్లకు పైగా నమోదు కావడం…

2 minutes ago

దాదా వెనక్కు తగ్గే ఉద్దేశంలో లేడా?

షూటింగ్ సమయంలో ప్రమాదం వల్ల గాయపడిన నందమూరి బాలకృష్ణ కోలుకున్నారు. సుమారు రెండు నెలలు విశ్రాంతిలో ఉండి మళ్ళీ సినిమాలతో…

24 minutes ago

రిలేషన్ సరే… కంటెంట్ రివీల్ చేయండి

దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి చేతిలో కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉన్నాయి. ట్రైలర్…

46 minutes ago

కారు బానెట్‌ పై ఇల్లాలు… కారు లోపల ప్రియురాలు

భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…

2 hours ago

కుటుంబం సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి

నిన్న ఉన్నట్టుండి ఆదర్శ కుటుంబం ఏకె 47 పండగ బరి నుంచి తప్పుకుందనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. ఇంకా…

3 hours ago

రాజమౌళి రాబోయే ‘ట్రబుల్’ని గుర్తించలేదా

స్వంత కుటుంబం సినిమా. కార్తికేయ నిర్మాతగా వ్యవహరించి పక్క భాషనుంచి ఫహద్ ఫాసిల్ ని తీసుకొచ్చి తీసిన మూవీ. పైగా…

3 hours ago