సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ కొత్త మూవీ సంబరాల ఏటిగట్టు ఇప్పటిదాకా విడుదల తేదీ ఖరారు చేసుకోలేదు. ఫిలిం నగర్ టాక్ ప్రకారం ఇంకా బ్యాలన్స్ షూటింగ్ కి కావాల్సిన బడ్జెట్ విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయని, అవి సమకూరగానే వెంటనే పూర్తి చేసేందుకు నిర్మాత నిరంజన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే ఇందులో నిజా నిజాలు ఎంత ఉన్నాయో కానీ మొత్తానికీ ప్యాన్ ఇండియా మూవీ ఇబ్బందులు పడుతున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది.
దీని వల్ల సాయి దుర్గ తేజ్ కు మరో సమస్య ఉంది. క దర్శకులతో అనౌన్స్ చేసిన కొత్త ప్రాజెక్టు సెట్స్ మీదకు వెళ్లాలంటే ఇప్పుడు పెంచిన బారుడు గెడ్డం తగ్గించాలి. హెయిర్ స్టైల్ కూడా మార్చాలి. కానీ సంబరాల ఏటిగట్టు గుమ్మడికాయ కొట్టకుండా ఈ రెండు పనులు చేయలేడు. పైగా మేనమామ చిరంజీవి విశ్వంభర తరహాలోనే ఈ మూవీకి కూడా ఓటిటి, డబ్బింగ్ డీల్స్ ఆలస్యంగా జరుగుతున్నాయట. జాప్యానికి అది కూడా కారణంగా మాట్లాడుకుంటున్నారు.
కొత్త ఏడాదిలో ఆల్రెడీ నాలుగు నెలలు గడిచిపోయాయి. వేసవిలో వచ్చేందుకు పెద్ది, స్వయంభు, టాక్సిక్, లెనిన్ లాంటి క్రేజీ మూవీస్ రెడీ అవుతున్నాయి. ఆగస్ట్ లో ప్యారడైజ్, భోగి, జైలర్ 2 వగైరాలు క్యూ కట్టాయి. మెల్లగా సెప్టెంబర్ స్లాట్ కూడా నిండిపోయేలా ఉంది. నవంబర్ లో రామాయణ ఉంది. డిసెంబర్ మీద ప్రభాస్ ఫౌజీ కన్నేసిందని టాక్ ఉంది. ఇవన్నీ చూసుకుంటే సంబరాల ఏటిగట్టు ఆశలు ఈ ఏడాదిలో ఎప్పుడు వస్తుందనేది వేయి డాలర్ల ప్రశ్నగా నిలవనుంది.
సాయి దుర్గ తేజ్ గత సినిమా బ్రో వచ్చి మూడు సంవత్సరాలు దాటిపోయింది. ఈ టైం అంతా సంబరాల ఏటిగట్టుకే కేటాయించాడు. తనకో పెద్ద బ్రేక్ అవుతుందనే నమ్మకంతోనే ఇంత దాకా ఎదురు చూశాడు. అయితే అంతర్గత వర్గాల్లో ఏమో కానీ కామన్ ఆడియెన్స్ లో దీని మీద ఆసక్తి వచ్చేలా చేయాలి. గతంలో వదిలిన టీజర్లు, పోస్టర్లు పక్కనపెట్టి ఫ్రెష్ గా ఏదైనా కంటెంట్ సిద్ధం చేసుకోవాలి. లేదంటే 2026లో సంబరాలు జరగడం డౌటే. రిలీజ్ డేట్ ప్రకటన వీలైనంత త్వరగా ఇస్తే ఈ చర్చలు జరగవు.
This post was last modified on April 17, 2026 5:58 pm
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…
హీరో హీరోయిన్లకు.. పెద్ద టెక్నీషియన్లకు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోషకాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్లకు…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…
మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…
నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కి, భారీ అంచనాలతో రాబోతున్న సినిమా.. ది ప్యారడైజ్. ఏకంగా రూ.200…