పార్లమెంటులో డీలిమిటేషన్ సహా.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించేందుకు.. ఎంతసమయమైనా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. ఈ వ్యవహారంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజుజు కీలక నిర్ణయం తీసుకున్నారు. సభలో చర్చకు ఎంత సమయమైనా ఫర్వాలేదని.. స్పీకర్ విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. అవసరమైతే.. రాత్రివేళల్లోనూ చర్చ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
దీనిపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ.. సభలో ఒక్కొక్క పార్టీకి 3 గంటల పాటు చర్చకు సమయం ఇస్తున్నామన్నారు. అంతేకాదు.. ఒక పార్టీ తరఫున ఎంత మంది సభ్యులు మాట్లాడాలని అనుకున్నా.. స్వాగతిస్తున్నట్టు పేర్కొన్నారు. ఒకవేళ ఒక పార్టీ తరఫున ఒక సభ్యుడే సభకు వస్తే.. ఆ సభ్యుడికి కూడా కావాల్సినంత సమయం ఇస్తామని.. చెప్పారు. బిల్లులపై 15 గంటల నుంచి 22 గంటల వరకు అవకాశం ఉంటుందన్నారు.
అనంతరం.. రేపు(శుక్రవారం) సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. సభ్యులు తమ డిమాండ్లను.. తమ సూచనలు, సలహాలు తెలియజేసేందుకు మహత్తర అవకాశంగా పేర్కొన్నారు. మరోవైపు ప్రతిపక్ష సభ్యుల గొంతు నొక్కేస్తున్నారంటూ..పలువురు సభ్యులు చేసిన ప్రకటన నేపథ్యంలో అధికార పక్షం ఇలా సమయం ఇవ్వడం గమనార్హం. సభ్యులు అందరూ మాట్లాడేందుకు అవకాశం ఉంటుందని పేర్కొనడం విశేషం.
ఇదిలావుంటే.. ఇలా .. సభలో భారీ స్థాయిలో సమయం కేటాయించడం అనేది ఇటీవల కాలంలో ఇదే తొలిసారి. గతంలో మూడు వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిన సమయంలో రాత్రివేళల్లో కూడా సభను కొలువుదీర్చారు.
ఆ తర్వాత.. 2023లో మహిళా రిజర్వేషన్ కోసం చేపట్టిన ప్రక్రియపై చర్చించేందుకు కూడా ఇలానే కొంత వెసులుబాటు ఇచ్చారు. అయితే.. వాటికి భిన్నంగా.. ఇప్పుడు పార్టీలకు 3 గంటల చొప్పున కేటాయిస్తామని చెప్పడం ఇదే తొలిసారి. ఏదేమైనా.. సాధించుకోవాలన్న పట్టుదల నేపథ్యంలో కేంద్రం వ్యూహాత్మక అడుగు వేసిందనే చెప్పాలి.
This post was last modified on April 16, 2026 2:29 pm
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…
దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…
లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…