కారు.. అంతకు మించిన పెద్ద వాహనాలు ఉన్న ప్రతిఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిన జనవరి 1 డెడ్ లైన్ దగ్గరకు వచ్చేసింది. ఏదైనా ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే సమయంలో రోడ్డ మీద పన్ను వసూళ్లకు ప్రత్యేకంగా టోల్ ప్లాజాల్ని ఏర్పాటు చేయటం తెలిసిందే. ఈ టోల్ చెల్లింపులు ఇప్పటివరకు నగదు రూపంలో చేసేవారు. ఆ మధ్యలో పాస్టాగ్ సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ఈ జనవరి ఒకటి నుంచి తాజాగా కేంద్రం తీసుకొచ్చిన మార్గదర్శకాల ప్రకారం.. చెల్లింపులన్ని ఫాస్ట్ టాగ్ లోనే అనుమతిస్తారు.
ఇప్పటివరకు ప్రతి టోల్ ప్లాజా వద్ద.. రెండు వరుసలు నగదు చెల్లింపులకు అవకాశం ఉండేది. కానీ.. కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రకారం.. టోల్ చెల్లింపులన్ని ఎలక్ట్రానిక్ పద్దతిలో సాగేలా నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1 నుంచి ఫాస్ట్ గ్ లేకుంటే.. డబుల్ ఛార్జీ వసూలు చేయనున్నారు. అదే సమయంలో.. ప్రతి టోల్ ప్లాజాకు కిలో మీటరు ముందు.. ఫాస్ట్ గ్ అమ్మకాలతో పాటు.. రీఛార్జి సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు.
దేశ వ్యాప్తంగా 70 శాతం వాహనాలకు ఫాస్టాగ్ ఉన్నట్లుగా చెబుతున్నారు. తెలంగాణలో సుమారు 75 శాతం మేర వాహనాలకు ఫాస్టాగ్ ఉన్నట్లు చెబుతుంటే.. ఏపీలో మరికాస్త తక్కువగా ఉన్నగా తెలుస్తోంది. జనవరి ఒకటి నుంచి టోల్ చెల్లింపులన్ని డిజిటల్ పద్దతిలో సాగటం తప్పనిసరి చేయటంతో.. ఫాస్టాగ్ లేని వారు వెంటనే తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో వాహనదారులకు ఇబ్బందులు ఖాయమని చెప్పక తప్పదు.