టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్.. డెకాయిట్ సినిమా సక్సెస్ మీట్లో ఈ చిత్ర కథానాయిక మృణాల్ ఠాకూర్‌ను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలో తాను ఇక్కడి అబ్బాయిని పెళ్లి చేసుకోమని లావణ్య త్రిపాఠికి చెబితే, ఆమె వరుణ్‌తేజ్‌ను పెళ్లాడి హైదరాబాద్‌లో సెటిలైపోయిన విషయాన్ని గుర్తు చేసిన అరవింద్.. మృణాల్ కూడా ఇక్కడి అబ్బాయినే పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండిపోవాలని ఆకాంక్షించారు.
దీంతో మృణాల్ తెగ సిగ్గుపడిపోయింది. ఆడిటోరియం అంతా నవ్వులతో నిండిపోయింది. ఐతే అరవింద్ ఈ కామెంట్ చేసిన కాసేపటికే సోషల్ మీడియా జనాలు డ్యూటీ ఎక్కేశారు. లావణ్య.. వరుణ్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసే అరవింద్ అప్పట్లో ఆ కామెంట్ చేశారని, ఇప్పుడు మృణాల్ కూడా ఇక్కడ ఓ అబ్బాయిని చూసుకుంది కాబట్టే ఆయన ఇలా మాట్లాడారని కథలు అల్లేశారు. అంతే కాక ఆ అబ్బాయి ఎవరో కూడా చెప్పేశారు.
అక్కినేని ఫ్యామిలీకి చెందిన సుమంత్‌తో మృణాల్ ప్రేమలో ఉన్నట్లుగా పేర్కొంటూ వీళ్లిద్దరూ సన్నిహితంగా ఉన్న ఒక ఫొటోను షేర్ చేస్తున్నారు నెటిజన్లు. సుమంత్, మృణాల్ కలిసి సీతారామం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఇద్దరూ ఎక్కడో ఒక ఫొటోకు పోజు ఇచ్చారు.
ఆర్టిస్టులు కలిసి నటించినపుడు ఇలా ఫొటోలు దిగడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ సోషల్ మీడియా జనాలు మాత్రం ఇలా ఆలోచించడం లేదు. ఇద్దరికీ లింక్ పెట్టేశారు. కానీ డెకాయిట్ ప్రి రిలీజ్ ఈవెంట్లో మృణాల్.. సుమంత్‌ను అన్నా అని సంబోధించిన విషయాన్ని మరవకూడదు. అన్న అనే పదానికి అర్థం తెలియకుండానే ఆమె అలా అని ఉండదు.
సుమంత్‌కు గతంలో హీరోయిన్ కీర్తి రెడ్డితో పెళ్లయింది. కొంత కాలానికే ఇద్దరూ విడిపోయారు. 20 ఏళ్లకు పైగా సుమంత్ సింగిల్‌గానే ఉంటున్నాడు. తనకు మళ్లీ పెళ్లి చేసుకునే ఉద్దేశమే ఉన్నట్లు కనిపించడం లేదు. పైగా సుమంత్‌కు 51 ఏళ్లు వచ్చేశాయి. మృణాల్ కంటే అతను చాలా పెద్దవాడు. వయసు 50 దాటినా, అమ్మాయితో వయసు అంతరం ఉన్నా పెళ్లి చేసుకోవడానికి అవేవీ అడ్డంకులు కాదు కానీ.. సుమంత్, మృణాల్ మధ్య ఎలాంటి వ్యక్తిగత బంధం లేదన్నది క్లియర్‌గా తెలుస్తున్నా.. ఇలా లింక్ పెట్టేయడం విచిత్రం.
This post was last modified on April 13, 2026 8:07 am
రాజమౌళి సినిమా అంటే.. ఫ్యామిలీ అంతా కలిసి ఎలా కష్టపడతారో.. ఎంతగా ఇన్వాల్వ్ అవుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.…
ఈ రోజుల్లో అభిమానులను పట్టించుకుని, వాళ్లను మేనేజ్ చేయకపోతే స్టార్ హీరోల ఇమేజ్ పెరగడం, మార్కెట్ విస్తరించడం కష్టమవుతుంది. స్టార్‌గా…
సినిమా హీరోలు రాజకీయ పార్టీలు పెట్టడం తమిళనాడు లో ఎప్పటి నుంచో చూస్తున్నదే. ఈసారి దానికి భిన్నంగా అభిమానులు పార్టీ…
ఇరుముడి థియేటర్ లో విడుదలైనప్పుడు ఒకలా, ఓటిటిలో వచ్చాక మరోలా డిస్కషన్స్ లో నిలుస్తోంది. ముఖ్యంగా ఒక బ్లాక్ బస్టర్…
కేవలం ఒక నెల రోజుల గ్యాప్ లో బాక్సాఫీస్ మూడు విలువైన పాఠాలు నేర్చుకుంది. ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారు, ఎలాంటి…
మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్ తో పోటీ పడుతూ వేగంగా సినిమాలు చేయడంలో పృథ్విరాజ్ సుకుమారన్ ఎప్పుడూ ముందు వరసలో…