Political News

జ‌మిలికి జై కొట్టాలా?.. కాంగ్రెస్ అంత‌ర్మ‌థ‌నం!

దేశంలో రెండు కీల‌క అంశాల‌ను తేల్చేసేందుకు కేంద్రంలోని న‌రేంద్ర మోడీ సర్కారు సిద్ధ‌మైంది. 1) జ‌మిలి ఎన్నిక‌లు. 2) పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌. ఈ రెండు అంశాల‌ను తేల్చేందుకు.. ఈ నెల 16 నుంచి మూడు రోజుల పాటు పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌లు ప్ర‌త్యేకంగా భేటీ అవుతున్నాయి. వీటిని తేల్చ‌డంలో ఇప్ప‌టికే ఆల‌స్య‌మైంద‌ని.. ప్ర‌ధాన మంత్రి మోడీ ఇటీవ‌ల కూడా పేర్కొన్నారు.

ఈ నేప‌థ్యంలో ప్ర‌త్యేక పార్ల‌మెంటు స‌మావేశాల్లో దీనిని తేల్చేయాల‌ని నిర్ణ‌యించారు. అయితే.. ఈ రెండు విష‌యాల‌పై ఏం చేయాల‌న్న అంశం కాంగ్రెస్‌ను ఇర‌కాటంలోకి నెట్టింది. తాజాగా నిర్వ‌హించిన‌ ఏఐసీసీ స‌మావేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆ పార్టీ అగ్ర‌నేత‌లు చ‌ర్చించారు. నియోజ‌క‌వర్గాల పున‌ర్విభ‌జ‌న‌ను గుడ్డిగా స‌మ‌ర్థించ‌డానికి వీల్లేద‌ని తీర్మానించారు.

జ‌నాభా ఆధారంగా జ‌ర‌గాల్సిన నియోజ‌క‌వ‌ర్గాల పెంపు వ్య‌వ‌హారాన్ని జ‌నాభాతో సంబంధం లేకుండా.. కేవ‌లం బీజేపీ త‌న రాజ‌కీయ కోణంలోనే చూస్తోంద‌ని.. త‌ద్వారా ఉత్త‌రాదిలో బీజేపీ బ‌లం పెంచుకునేందుకు అవ‌కాశం ఉంద‌ని సమావేశంలో నేత‌లు అభిప్రాయ‌ప‌డ్డారు. అదేస‌మ‌యంలో జ‌మిలి ఎన్నిక‌ల పైనా ఇదే అభిప్రాయం వ్య‌క్త‌మైంది. దాదాపు 40 ఏళ్లుగా విడివిడిగా జ‌రుగుతున్న ఎన్నిక‌ల‌ను ఇప్పుడు జ‌మిలి ఎన్నిక‌లుగా మార్చ‌డం వెనుక బీజీపీ రాజ‌కీయ వ్యూహాలు ఉన్నాయ‌ని నాయ‌కులు చెప్పుకొచ్చారు.

ఈ నేప‌థ్యంలో జ‌మిలి ఎన్నిక‌లు స‌హా.. నియోజ‌క‌వ‌ర్గాల‌పున‌ర్విజ‌న అంశంపై ఇరు స‌భ‌ల్లోనూ సుదీర్ఘ చ‌ర్చ జ‌రిగేలా చూడాల‌ని.. ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నం, రాష్ట్రాల ప్ర‌యోజ‌నం వంటి కీలక అంశాల‌పై చ‌ర్చించాల‌ని భావించారు. కానీ.. ఇప్పుడు ఉభ‌య స‌భ‌ల్లోనూ బీజేపీ అనుకూల పార్టీల‌సంఖ్య పెర‌గ‌డం.. ఉభ‌య స‌భ‌ల్లోనూ బీజేపీకి మ‌ద్ద‌తు కూడా పెరిగిన ద‌రిమిలా..ఈ రెండు అంశాల‌కు పార్ల‌మెంటు ఆమోదం తెల‌ప‌డం.. లాంఛ‌న‌మే అవుతుందన్న వాద‌న ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ త‌న అనుకూల పార్టీల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని నిర్ణ‌యించింది.

This post was last modified on April 11, 2026 7:03 pm

Share

Recent Posts

రిలేషన్ సరే… కంటెంట్ రివీల్ చేయండి

దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి చేతిలో కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉన్నాయి. ట్రైలర్…

21 minutes ago

కారు బానెట్‌ పై ఇల్లాలు… కారు లోపల ప్రియురాలు

భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…

2 hours ago

కుటుంబం సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి

నిన్న ఉన్నట్టుండి ఆదర్శ కుటుంబం ఏకె 47 పండగ బరి నుంచి తప్పుకుందనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. ఇంకా…

2 hours ago

రాజమౌళి రాబోయే ‘ట్రబుల్’ని గుర్తించలేదా

స్వంత కుటుంబం సినిమా. కార్తికేయ నిర్మాతగా వ్యవహరించి పక్క భాషనుంచి ఫహద్ ఫాసిల్ ని తీసుకొచ్చి తీసిన మూవీ. పైగా…

3 hours ago

ఎవరూ పట్టించుకోని ‘యుగంధర్’ పోరాటం

కొత్త సినిమా రిలీజ్ అంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రతిదానికి ఎంతో కొంత ఓపెనింగ్ ఇచ్చే ప్రేక్షక వర్గం…

3 hours ago

మంచి ఆలోచన చేసిన రణబాలి

దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…

7 hours ago