అవును, నిజమే.. విజయ్ సాయి రెడ్డి మీడియా రంగంలోకి వస్తున్నారట.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్లో వెల్లడించారు. త్వరలో డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫాం ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
వైసీపీలో ఒకప్పుడు కీలక వ్యక్తిగా, వైయస్ జగన్ కు అత్యంత ఆప్తుడిగా గుర్తింపు పొందారు, ఆ పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా పదవులను అనుభవించి.. తర్వాత జరిగిన పరిణామాలతో పార్టీ నుంచి బయటికి వచ్చిన విజయసాయిరెడ్డి ప్రస్తుతం వ్యవసాయం చేసుకుంటున్నారు.
పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సమయంలో ఆయన రాజకీయాలను వదిలేస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు. అయితే లిక్కర్ స్కామ్ లో విచారణను ఎదుర్కొంటున్న సమయంలో పలుసార్లు మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో జగన్ కోటరీ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. త్వరలో రాజకీయ నిర్ణయం తీసుకుంటానని కూడా ప్రకటించారు.
ఈ క్రమంలో ఆయన సడెన్ గా.. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో వార్తలను అందించే కొత్త డిజిటల్ మీడియా వేదికను త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. పక్షపాతం లేకుండా, నిజాయితీతో వార్తలను అందించడం ఈ వేదిక ప్రధాన లక్ష్యమని తెలిపారు. సాధారణ ప్రజలు, మహిళలు, యువత, రైతులు, కార్మికులు, వెనుకబడిన వర్గాల సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే ఈ ప్లాట్‌ఫాం లక్ష్యంగా పేర్కొన్నారు. ప్రజల సమస్యలకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా కంటెంట్ రూపొందించనున్నట్లు తెలిపారు.
మరోవైపు ఈ మీడియా వేదిక ఎలాంటి రాజకీయ పార్టీకి అనుకూలంగా లేకుండా స్వతంత్రంగా కొనసాగుతుందని విజయసాయి స్పష్టం చేశారు. నిష్పక్షపాత ధోరణితో వార్తలను అందించడమే లక్ష్యమని వెల్లడించారు.
భవిష్యత్‌లో శాటిలైట్ ఛానల్ ను కూడా ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్లాట్‌ఫాం పేరును త్వరలో ప్రకటించనున్నట్లు పేర్కొంటూ, తదుపరి వివరాల కోసం వేచి చూడాలని కోరారు.
విజయ సాయి వైసీపీలో ఉన్నప్పుడే ఒక కొత్త మీడియా వేదికను మొదలు పెడతారనే వార్తలు వినిపించాయి. కొత్త మీడియా ఛానెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు 2022లోనే వార్తలు వచ్చాయి. అయితే, ఆయన సొంత మీడియా పెడతారా లేదా, లేక వైయస్సార్‌సీపీ తరపున వేరే ఛానెల్ బాధ్యతలు తీసుకుంటున్నారా అనే చర్చ అప్పట్లో జరిగింది. అనంతరం జరిగిన పరిణామాలలో విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు ఎన్నికలకు మూడేళ్ల ముందుగా సొంత ఛానల్ ను స్టార్ట్ చేస్తానని చెప్పడం రాజకీయ వర్గాలలో చర్చకు దారి తీసింది.
This post was last modified on April 11, 2026 12:02 pm
ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…
కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…
బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…