Political News

షాకింగ్: గుడివాడ అమర్నాథ్ కు జైలు శిక్ష

వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ విశాఖపట్నం రెండో అదనపు ప్రధాన న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. 2016 ఏప్రిల్‌లో విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన ఆందోళనలకు సంబంధించి నమోదైన కేసులో ఈ తీర్పు వచ్చింది.

అప్పట్లో నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అమర్నాథ్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి నిరసనలు వ్యక్తం చేశారు. ఈ ఘటనపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి వరలక్ష్మి శిక్షను ఖరారు చేశారు.

కోర్టు తీర్పుతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా అమర్నాథ్ స్పందిస్తూ దిగువ న్యాయస్థానం తీర్పుపై హైకోర్టులో అప్పీల్‌కు వెళ్తానని తెలిపారు. విశాఖ రైల్వే జోన్ కోసం తాను చేసిన పోరాటమే ఫలించి ప్రస్తుతం జోన్ సాధ్యమైందని పేర్కొన్నారు. న్యాయపరంగా తన పోరాటాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

This post was last modified on April 11, 2026 10:05 am

Share

Recent Posts

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…

4 minutes ago

అక్టోబర్ మార్కెట్… ఎవరెవరికి జాక్‌‌పాట్

కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…

18 minutes ago

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

58 minutes ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

1 hour ago

టీ 20 చూస్తూ పారిశ్రామికవేత్తలతో చర్చించా

నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…

1 hour ago

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

2 hours ago