Movie News

కంటెంట్‌లో డీసెంట్… మరి కలెక్షన్లలో?

ఈ రోజుల్లో సినిమాకు మంచి టాక్ వచ్చినంత మాత్రాన హిట్టయిపోతుందనే గ్యారెంటీ లేదు. రిలీజ్‌కు ముందు హైప్ క్రియేట్ కావడం.. అడ్వాన్స్ బుకింగ్స్ కొంచెం గట్టిగా జరగడం.. ఓపెనింగ్స్ బాగా రావడం.. సినిమాకు లాంగ్ రన్ ఉండడం.. ఇవన్నీ జరిగితేనే ఆ చిత్రం హిట్ అనిపించుకుంటుంది. కంటెంట్ పరంగా ‘హిట్’ అనిపించుకుని.. కలెక్షన్ల పరంగా చూస్తే డిజాస్టర్లు అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఈ జాబితాలోకే చేరేలా శర్వానంద్ మూవీ ‘బైకర్’.

గత వారం విడుదలైన ఈ చిత్రానికి పెయిడ్ ప్రిమియర్స్ నుంచే డీసెంట్ టాక్ వచ్చింది. రివ్యూలు కూడా పాజిటివ్‌గానే ఉన్నాయి. కానీ ఈ టాక్‌కు తగ్గట్లుగా వసూళ్లు మాత్రం రాలేదు. ప్రి రిలీజ్ హైప్ లేకపోవడం ఈ చిత్రానికి మైనస్ అయింది. వీకెండ్లో ఓ మోస్తరు కలెక్షన్లు వచ్చాయి కానీ.. టాక్‌కు తగ్గట్లు అయితే కాదు. తొలి రోజుతో పోలిస్తే వీకెండ్ రెండు రోజులు కలెక్షన్లు పెరుగుతాయని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఇక వీకెండ్ తర్వాత అయితే ‘బైకర్’ పరిస్థితి దయనీయంగా మారింది. థియేటర్లు పూర్తిగా ఖాళీ అయిపోయాయి.

వీక్ డేస్‌లో పరిస్థితి చూస్తే ‘బైకర్’ థియేట్రికల్ రన్ దాదాపుగా ముగిసిపోయినట్లే కనిపించింది. ఫుల్ రన్లో ఈ సినిమా గ్రాస్ కలెక్షన్లు రూ.20 కోట్ల మార్కును దాటే అవకాశం కనిపించడం లేదు. చిత్ర బృందం ఈ సినిమాను పెద్ద హిట్ అన్నట్లుగా సక్సెస్ మీట్, థాంక్యూ మీట్‌లు నిర్వహిస్తోంది. కానీ రిజల్ట్ ఏంటన్నది ట్రేడ్‌కు బాగా తెలుసు.

రూ.40 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తేనే బ్రేక్ ఈవెన్ అయ్యే సినిమాకు ఫుల్ రన్లో అందులో సగానికి మించి వచ్చే అవకాశం లేదంటే బాక్సాఫీస్ లెక్కల్లో ఈ సినిమాను ఏమనాలో ప్రత్యేకంగా చెప్పాలా? ఒకప్పుడు మంచి టాక్ వస్తే సినిమా హిట్ అని ధీమాగా ఉండేవాళ్లు నిర్మాతలు. కానీ ఇప్పుడు ఆ గ్యారెంటీ లేదు. ఇండస్ట్రీ ఎలాంటి దుస్థితిలో ఉందో చెప్పడానికి ఇంతకంటే రుజువేం కావాలి.

This post was last modified on April 11, 2026 3:21 pm

Share

Recent Posts

డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవాడ్ని

నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…

2 hours ago

ప్యార‌డైజ్ ద‌ర్శ‌కుడు రాజమౌళి ద‌గ్గ‌ర చేరతాడ‌ట‌

ఇండియాస్ నంబ‌ర్ వన్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేయాల‌ని కాబోయే డైరెక్ట‌ర్ కావాల‌నుకున్న ప్ర‌తి వ్య‌క్తికీ…

2 hours ago

ట్రైలర్ లేకపోవడం ఎంత వరకు సేఫ్

అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…

4 hours ago

ఇంద్ర చూపిన దారిలో మిగిలినవీ రావాలి

తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…

6 hours ago

అసలు భయాన్ని థియేటర్‌లో చూపిస్తారేమో

ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…

7 hours ago

తెలుగులో లేట్ రిలీజ్ పర్లేదంటారా

బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…

8 hours ago