పైకి అంతా బాగుందని చెప్పడానికి, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో విశ్లేషించడానికి చాలా తేడా ఉంటుంది. పైకి మెచ్చుకోళ్లకు, మెప్పులకు ప్రభుత్వ పెద్దలు ఒగ్గిపోతే ఎవరు ఏమీ చేయలేరు. కానీ వాస్తవాలను చెప్పే క్రమంలో వస్తున్న విమర్శలను పట్టించుకోకపోతే మాత్రం పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ తీవ్రంగా గాడి తప్పిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇది వైసీపీ నాయకులు గానీ, జగన్ గానీ చెబుతున్న విషయం కాదు. వారు చెప్పాలనుకున్నా కూడా చెప్పే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ప్రజల్లో అసంతృప్తి పెరిగితే అది తమకు అనుకూలమవుతుందనే భావన ఉంది. అయితే వాస్తవాలు చిన్న చిన్న సోషల్ మీడియా వేదికల ద్వారా బయటకు వస్తున్నాయి. పోలీసులు చేస్తున్న కొన్ని చర్యలు ప్రజల ప్రాణాలకే ముప్పుగా మారుతున్నాయి. అదే సమయంలో ప్రభుత్వ ప్రతిష్టకూ దెబ్బతీస్తున్నాయి.
గత వారం జరిగిన మూడు ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపాయి. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం వీటిపై గంభీరంగా స్పందించలేదనే విమర్శలు ఉన్నాయి.
రైల్వే కోడూరులో ఒక పార్టీ నాయకుడు, పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ చేతిలోని లాఠీని లాక్కొని, ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై ఆరోపణలు చేసిన మహిళను నడిరోడ్డుపై కొట్టాడు. ఆ సమయంలో ఎస్సై చూస్తూ ఉండిపోయినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా పోలీసుల లాఠీతో దాడి జరగడం పెద్ద వివాదంగా మారింది.
పల్నాడు జిల్లాలో ఒకే సామాజిక వర్గానికి చెందిన యువతి, యువకుడు ప్రేమించి వివాహం చేసుకున్నారు. యువతి తండ్రికి ఈ వివాహం నచ్చకపోవడంతో వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో ఒక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారి, యువతి తండ్రి నుంచి సుమారు 2 లక్షల రూపాయలు తీసుకుని, యువతిని బలవంతంగా అతనికి అప్పగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అదే రోజు రాత్రి ఆమెను హత్య చేసిన ఘటన
కలకలం రేపింది. ఈ ఘటనలో పోలీసు అధికారి పాత్ర ఉన్నట్లు నమోదైంది.
ఆకివీడులో దళిత వర్గం మరియు ఉపసభాపతి మధ్య జరిగిన వివాదంలో, పోలీసులు హద్దులు మీరినట్లు మానవ హక్కుల సంఘాలు పేర్కొన్నాయి. ఘటన సమయంలో అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకోకపోవడంతో పాటు, తర్వాత సంబంధం లేని వారిపై కేసులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉండగా, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఈ మూడు ఘటనలు ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపేలా ఉన్నాయి. ఇలాంటి అంశాలపై చంద్రబాబు తక్షణమే స్పందించి పరిస్థితిని అదుపులోకి తేవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇవే ఘటనలు మరింత పెద్ద వివాదాలకు, వ్యతిరేకతకు దారితీసే ప్రమాదం ఉంది.
This post was last modified on April 9, 2026 11:33 am
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…