Movie News

తెర వెనుక యానిమేషన్ పనుల్లో అనిల్

మన శంకరవరప్రసాద్ గారుతో సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ – కళ్యాణ్ రామ్ కాంబోలో మరో ఎంటర్ టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే దీని షూటింగ్ గుట్టుచప్పుడు కాకుండా మొదలైపోయింది. ఆదర్శ కుటుంబంలో బిజీగా ఉన్న వెంకీ అది కాగానే జూన్ లేదా జూలై నుంచి పూర్తి స్థాయి కాల్ షీట్లు అనిల్ కి ఇవ్వబోతున్నారు. ఇదిలా ఉండగా దీంతో పాటు రావిపూడి మరో యానిమేటెడ్ ప్రాజెక్టు మీద వర్క్ చేస్తున్న లీక్ కొద్దిరోజుల క్రితం బయటకి వచ్చింది.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాకు టీమ్ సెట్టయిపోయి పనులు కూడా మొదలుపెట్టేసిందట. హనుమాన్, మిరాయ్ లాంటి ఫాంటసీ బ్లాక్ బస్టర్లకు పని చేసిన సంగీత దర్శకుడు గౌరా హరి ఆల్రెడీ తన పాటల వర్క్ మొదలుపెటినట్టు ఫిలిం నగర్ టాక్. యానిమేషన్, విఎఫెక్స్ కంపెనీలతో నిత్యం చర్చల్లో ఉన్న అనిల్ రావిపూడి తాను పూర్తిగా బిజీ అయ్యేలోపల దీన్నో కొలిక్కి తేవాలని చూస్తున్నారు. ఆర్టిస్టుల అవసరం లేదు కాబట్టి డేట్లు, క్లాషుల సమస్య రాదు.

ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఎలాంటి అధికారిక వివరాలు బయటికి రాలేదు. తాను టేకప్ చేయబోయే యానిమేషన్ మూవీ కావడంతో స్పెషల్ గా ప్రమోషన్లు చేయాలని అనిల్ నిర్ణయించుకున్నారట. వెంకీ మూవీ అయిపోయాక పూర్తిగా దీని మీద ఫోకస్ పెడతారట. రామాయణ మొత్తం కాకుండా ఆయన జీవితంలో ఒక కీలక ఘటాన్ని తీసుకుని దాన్ని సరికొత్త రీతిలో ప్రెజెంట్ చేస్తారట. అంటే మహావతార్ నరసింహ తరహాలో అన్న మాట.

మొత్తానికి అనిల్ రావిపూడి త్వరలో కొత్త జానర్స్ అయితే ట్రై చేయబోతున్నాడు. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రూపొందబోయే ఈ సినిమాలో రామాయణం నుంచి ఏ ఘట్టం తీసుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. కామెడీ లేనిదే సీన్లు రాయలేని రావిపూడి మరి రామాయణంలో వినోదాన్ని జొప్పించే అవకాశం సృష్టిస్తారా లేక సీరియస్ నెరేషన్ కు కట్టుబడతారా అనేది వేచి చూడాలి. సోషల్ మీడియాలో చూస్తే అర్థమవుతుంది  అనిల్ రావిపూడికి ఎంత క్రేజ్ ఉందో.

This post was last modified on April 9, 2026 11:02 am

Share

Recent Posts

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

2 minutes ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

2 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

3 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

3 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

11 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

13 hours ago