వైసీపీ అధినేత జగన్‌ను సమర్థించేవారు.. ఉన్నారా? అంటే.. ఉన్నారు. ఇటు సోషల్ మీడియా వేదికగా.. అటు రాజకీయంగా కూడా ఆయనను .. ఆయన విధానాలను తరచుగా సమర్థించే నాయకులు చాలా మందే ఉన్నారు. ఇక, జర్నలిస్టులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా ఈ జాబితాలో కొందరు ఉన్నారు. జగన్ ఏం చేసినా.. ఏం మాట్లాడినా.. వారు మీడియా ముందుకు రావడమో.. సోషల్ మీడియాలో వీడియోలు చేయడమో.. అందరికీ తెలిసిందే.
మూడు రాజధానుల నుంచి అనేక విషయాల వరకు.. కూడా జగన్‌ను పలువురు సమర్థిస్తున్న వ్యవహారం.. వారు చేస్తున్న కామెంట్లు కూడా సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నాయి. జగన్ తరఫున రాజకీయ నేతల కంటే కూడా ఎక్కువగా కొందరు జర్నలిస్టులు మాట్లాడుతున్నారు. అయితే.. తాజా పరిణామాల క్రమంలో వారు సైతం జగన్ వ్యవహారాన్ని సమర్థించలేక.. మౌనంగా ఉండిపోవడం గమనార్హం. అమరావతికి చట్టబద్ధత కల్పించే విషయంలో కూటమి దూకుడు తెలిసిందే.
అయితే.. ఇదేసమయంలో జగన్.. మావిగన్(మచిలీపట్నం-విజయవాడ-గుంటూరులతో కూడిన రాజధాని) ఫార్ములాను తెరమీదికి తెచ్చారు. ఈ మూడు ప్రాంతాలను తీసుకుని కూడా డెవలప్ చేసుకునేందుకు అవకాశం ఉందని.. లక్షల కోట్ల రూపాయలతో అమరావతిని ఎప్పటికి అభివృద్ధి చేస్తారని ఆయన ప్రశ్నించారు. కానీ.. ప్రజలు మాత్రం అమరావతికి అనుకూలంగా ఉన్నారన్న విషయాన్ని.. అమరావతి రైతులు త్యాగాలు చేశారన్న విషయాన్ని జగన్ మరిచిపోతున్నారు. ఉద్దేశపూర్వంగానే విస్మరిస్తున్నారు.
మరీ ముఖ్యంగా.. ఒక ఇంటిని నిర్మించేప్పుడే.. అనేక ప్రణాళికలతో మొదలు పెడతారు. దానిని పూర్తి చేసేందుకు కొంత సమయం పడుతుంది. ముందు అనుకున్న ప్రణాళికలతోనే రంగంలోకి దిగినా.. కుటుంబ సభ్యుల సూచనలు, సలహాలతో అనేక మార్పులు జరుగుతాయి. ఈ విషయంలో అమరావతి కూడా అంతే!. సుదీర్ఘ ప్రణాళికలను.. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే.. విస్తరణ ప్రణాళిక ఎక్కువగానే ఉంది. దీనిని కూడా జగన్ విస్మరిస్తున్నారు.
మూడు రాజధానులను కాదని.. మావిగన్‌ను తెరమీదికి తెచ్చారు. అయితే.. జగన్ ప్రతిపాదనలను సొంత పార్టీ నాయకులతో పాటు.. ఆయనను సమర్థించే సోషల్ మీడియా ఇన్ ప్లుయెన్సర్లు కూడా సమర్థించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎవరూ పెద్దగా ముందుకు రాలేదు. అయితే.. అమరావతికి లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ నుంచి తెస్తారన్న ప్రశ్న మాత్రమే వారు సంధిస్తున్నారు. సహజంగా అభివృద్ధి చెందే క్రమంలో తొలిదశ అమరావతి పూర్తయితే.. దాని సొమ్ములను అదేసంపాయించుకుంటుందన్న చర్చ కూటమి నుంచి వస్తుండడంతో జగన్ అనుకూల మీడియా సహా.. ఇతర వర్గాలు సైలెంట్ కావడం గమనార్హం.
This post was last modified on April 3, 2026 9:40 pm
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…
దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…
లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…