ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి. ప్రధానంగా బిల్లును ప్రతిపాదించిన విధానంలోనే చంద్రబాబు దూరదృష్టి కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. ఎక్కడా కూడా బిల్లులో రాజధాని ప్రాంతానికి సరిహద్దులు ఇవీ.. అని ప్రస్తావించలేదు. దీనికి కారణం.. భవిష్యత్తులో రాజధానిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పమే!.
తద్వారా.. రాజధాని పరిధిని ఇప్పుడే పేర్కొంటే.. భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని భావిస్తున్న సీఎం .. దానికి అనుగుణంగా.. `సీఆర్ డీఏ` పరిధిలోని ప్రాంతం మొత్తాన్నీ రాజధానిగా పేర్కొంటూ బిల్లును ప్రతిపాదించారు. అయితే.. ఈ విషయాన్ని గుర్తించని కొన్ని వర్గాలు.. దీనిపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇక, మరో కీలక ప్రతిపాదన.. ఖర్చు విషయం. దీనిపై కూడా రాజధాని విమర్శలు వస్తున్నాయి. కానీ.. వాస్తవం.. ఏంటంటే.. అమరావతి నిర్మాణం.. అనేది ఇప్పటితో పోయేది కాదు.
భవిష్యత్తులోనూ అనేక నిర్మాణాలు సాగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఖర్చు విషయాన్ని కూడా బిల్లులో పెట్టలేదని ఓ ఎంపీ తెలిపారు. ఇక, రాజధాని రైతుల ప్రయోజనాల విషయంపై వైసీపీ ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. ఇరు సభల్లోనూ ఈ విషయాన్ని ప్రతిపాదించారు. అయితే.. రైతుల ప్రయోజనాల విషయం వేరే.. అమరావతి చట్టబద్ధత విషయం వేరే అన్నది ప్రభుత్వం వాదన.
రైతులకు సంబంధించిన ప్రయోజనాలను విడిగా పేర్కొనేందుకు రాష్ట్రస్థాయిలో నిర్ణయం జరగనుంది. సో.. మొత్తంగా రాజధాని అమరావతిపై చంద్రబాబు ముందు చూపుతోనే కీలక నిర్ణయం తీసుకున్నారని పార్టీ ఎంపీలు చెబుతున్నారు. ఇతర ప్రశ్నలకు, సందేహాలకు కూడా త్వరలోనే సమధానం లభిస్తుందని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
