Political News

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను ఎదిరించి.. బెదిరించి నిలదొక్కుకునే పార్టీలు దాదాపు క‌నిపించ‌డం లేదు. ఎక్క‌డో ఒక చోట.. ఏదో ఒక సంద‌ర్భంలో మోడీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌త‌ప్ప‌డం లేదు. అయితే.. మోడీ సైతం.. ఆయా పార్టీలు, రాజ‌కీయ నేత‌ల వ్య‌వ‌హారాన్ని నిశితంగా గ‌మ‌నిస్తూ ఉంటారు. పార్టీలు ఏవైనా.. రాష్ట్రాలు మరేవైనా.. ఆయ‌న‌కు ఉండే సీనియ‌ర్ల నుంచి స‌మాచారం తెప్పించు కుంటారు. దాని ప్ర‌కారం రాజ‌కీయ నేత‌ల‌పై ఒక అంచ‌నా వేసుకుంటారు.

గ‌తంలో జ‌గ‌న్‌ను కూడా ఇలానే మోడీ అంచ‌నా వేసుకున్నారు. దానికి అనుకూలంగానే జ‌గ‌న్‌తో స్నేహం నెరిపారు. జ‌గ‌న్ మోడీకి `ద‌త్త‌పుత్రుడు`.. అని  కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ వ్యాఖ్యానించిన‌ప్ప‌టికీ.. మోడీ మాత్రం ఎంత వ‌ర‌కు జ‌గ‌న్‌తో వ్య‌వ‌హ‌రించాలో.. అంత వ‌ర‌కే వ్య‌వ‌హ‌రించారు. ఎప్ప‌టిక‌ప్పుడు జ‌గ‌న్ వ్య‌వ‌హార శైలిపైనా ఆయ‌న తెలుసుకున్నారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు పొత్తు విష‌యంలోనూ ఇలానే.. జ‌గ‌న్ వైఖ‌రిని తెలుసుకునే దాకా బీజేపీని సంయ‌మ‌నం పాటించేలా మోడీ వ్య‌వ‌హ‌రించార‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి.

ఇక‌, మూడు రాజ‌ధానులు స‌హా.. మ‌హిళ‌ల‌కు సంబంధించిన పోలీసు స్టేష‌న్ల ఏర్పాటు.. వంటి విష‌యంలోనూ జ‌గ‌న్‌తో మోడీ విభేదించారు. కానీ.. రాజ‌కీయంగా ఉన్న అవ‌స‌రాల నేప‌థ్యంలో మోడీ ఎక్క‌డా బ‌య‌ట ప‌డ‌లేదు. ఇక‌, ఇప్పుడు .. అమ‌రావ‌తి కి బీజేపీ స్వ‌యంగామ‌ద్ద‌తు తెలిపిన ద‌రిమిలా.. జ‌గ‌న్ కూడా దానికి అనుగుణంగా అడుగులు వేసి ఉంటే.. పెద్ద స‌మ‌స్య ఉండేది కాదు.. కానీ.. ఆయ‌న తీరు ఇంకా మార‌లేదు. వాస్త‌వానికి బీజేపీ ఈ బిల్లును లోక్‌స‌భ‌లో ప్ర‌తిపాదించ‌డానికి ముందే.. వైసీపీ లోక్‌స‌భ‌లో పార్ల‌మెంట‌రీ ప‌క్ష నాయ‌కుడు మిథున్‌రెడ్డితో చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం.

దీనికి మీరు కూడా ఆమోదం తెల‌పండి.. అని కేంద్ర పెద్ద‌లు మిథున్‌రెడ్డికి సూచించార‌ని తెలిసింది. అయితే.. త‌మ పార్టీ అధినేతను క‌నుక్కునిచెబుతాన‌ని అన్నప్ప‌టికీ.. ఆయ‌న ఎలాంటి నిర్ణ‌యం వెల్ల‌డించ‌లేదు. దీంతో బీజేపీ త‌న వైఖ‌రిని తాను ప్ర‌ద‌ర్శించింది. ఇక‌, లోక్‌స‌భ‌లో ఈబిల్లుపై చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే జ‌గ‌న్ తాడేప‌ల్లిలో దీనికి వ్య‌తిరేకంగా మాట్లాడ‌డం.. అవినీతి ఆరోప‌ణ‌లు చేయ‌డం.. వంటివి మ‌రింతగా ఆయ‌న‌ను ప‌లుచ‌న చేశాయి.

ముఖ్యంగా మ‌చిలీప‌ట్నం, విజ‌య‌వాడ‌, గుంటూరు.. ప్రాంతాల‌ను రాజ‌ధానం చేయాలంటూ..`మావిగ‌న్‌` ప్ర‌తిపాద‌న చేయ‌డంపై సెటైర్లు కురుస్తున్నాయి. ఈ ప‌రిణామాల‌తో జ‌గ‌న్ రాజ‌కీయ ప‌రిణితిపై అనేక సందేష‌హాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇది మ‌రింత ముదిరితే.. జ‌గ‌న్ విష‌యంలో మోడీకి ఉన్న సానుకూల అభిప్రాయం మ‌రింత త‌గ్గుతుంద‌ని.. ఆయ‌న మ‌రింత ప‌లుచ‌న కావ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వాస్త‌వానికి కేంద్రంలో మోడీ ద‌గ్గ‌ర అంతో ఇంతో జ‌గ‌న్‌కు ప‌లుకుబ‌డి ఉంది. ఇప్పుడు అది కూడా పోవ‌డం ఖాయ‌మ‌నిచెబుతున్నారు.. 

This post was last modified on April 1, 2026 10:17 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

2 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

3 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

3 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

3 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

4 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

5 hours ago