Movie News

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం ఎలా ఉన్నప్పటికీ అందులో రాముడి పాత్ర చేసినందుకు ప్రభాస్ ఎంతో సంతోషించాడు. ‘వారణాసి’లో కాసేపు ఆ పాత్రలో కనిపించబోతున్నందుకు మహేష్ బాబు సైతం ఎంతో ఎగ్జైటెడ్‌గా ఉన్నాడు.

ఐతే బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ మాత్రం.. ‘రామాయణ’లో రాముడి పాత్ర పోషించడానికి వెనుకంజ వేశాడట. నిర్మాత నమిత్ మల్హోత్రా నాలుగేళ్ల ముందు ఈ సినిమాలో నటించమని అడిగినపుడు తాను వెంటనే నో చెప్పినట్లు రణబీర్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

రాముడి పాత్ర చేయడానికి తాను సరిపోనని.. దానికి పూర్తి న్యాయం చేయలేనని తాను భావించి.. ఆ పాత్ర చేయడానికి నిరాకరించినట్లు రణబీర్ వెల్లడించాడు. కానీ ఆ తర్వాత తాను ఒక బిడ్డకు తండ్రినయ్యానని.. అప్పుడు తనకు రాముడి పాత్ర చేయాలని అనిపించిందని.. తండ్రి కావడం తన జీవితంలో గొప్ప మలుపు అని రణబీర్ చెప్పాడు. 

నితీశ్ తివారి దర్శకత్వంలో ‘రామాయణ’ సినిమా చేయడానికి పదేళ్ల ముందు అడుగులు పడ్డాయి. అల్లు అరవింద్‌తో కలిసి వేరే నిర్మాత ఈ ప్రాజెక్టును తెరపైకి తెచ్చాడు. ఏళ్ల తరబడి చర్చలు జరిగాయి. కానీ చివరికి నమిత్ మల్హోత్రా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాడు.

రాముడు, సీత పాత్రలకు చాలామంది నటీనటుల పేర్లు పరిశీలించి.. చివరికి రణబీర్ కపూర్, సాయిపల్లవిలను ఫైనలైజ్ చేశారు. ఇందులో యశ్ రావణుడి పాత్ర చేస్తున్నాడు. గత ఏడాది విడుదలైన ‘రామాయణ’ గ్లింప్స్ ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది.

గురువారం హనుమజ్జయంతి సందర్భంగా ఈ సినిమా నుంచి రాముడి పాత్రకు సంబంధించి గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఏడాది దీపావళికి ‘రామాయణం’ పార్ట్-1 రిలీజ్ కాబోతోంది. వచ్చే ఏడాది దీపావళికి రెండో భాగం రిలీజ్ చేయాలనుకుంటున్నారు. రెండు భాగాలకు కలిపి రూ.4 వేల కోట్ల బడ్జెట్ పెట్టినట్లు నిర్మాత వెల్లడించిన సంగతి తెలిసిందే.

This post was last modified on April 1, 2026 10:23 pm

Share

Recent Posts

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

26 minutes ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

32 minutes ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

47 minutes ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

1 hour ago

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

4 hours ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

5 hours ago