Political News

‘కేసీఆర్‌, హ‌రీష్‌రావును జైల్లో పెట్టాక మాట్లాడండి’

కాళేశ్వ‌రం ప్రాజెక్టు అవినీతి, దీనికి సంబంధించి నియ‌మించిన పీసీ ఘోష్ నివేదిక అంశాల‌పై తెలంగాణ అసెంబ్లీలో నిన్న స్వ‌ల్పకాలిక చ‌ర్చ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా బీజేపీ స‌హా బీఆర్ ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. కాళేశ్వ‌రంలో కాసులు మేసిందెవ‌రో.. ల‌క్ష‌ల కోట్లు దండుకున్న‌దెవ‌రో నివేదిక స్ప‌ష్టం చేసింద‌న్నారు. దీనిపై సీబీసీఐడీ వేస్తామ‌ని అంటే.. బీజేపీ నాయ‌కులే(కిష‌న్ రెడ్డి) సీబీఐకి ఇస్తే.. వేగంగా విచార‌ణ పూర్త‌వుతుంద‌న్నార‌ని.. సీబీఐకి ఇచ్చామ‌న్నారు.

కానీ.. నెల‌లు గ‌డుస్తున్నా.. సీబీఐ విచార‌ణే ఇంకా ప్రారంభం కాలేద‌ని రేవంత్ చెప్పారు. దీనిని బ‌ట్టి ఎవ‌రు ఎవ‌రితో కుమ్మ‌క్కు అవుతున్నారో అర్ధం అవుతుంద‌ని విమ‌ర్శించారు. కాళేశ్వ‌రంలో అన్ని విష‌యాల‌పైనా అప్ప‌టి సీఎం కేసీఆర్ బాధ్య‌త వ‌హించాల్సిందేన‌ని తేల్చి చెప్పారు. ప్రాజెక్టు రీ-డిజైనింగ్ నుంచి బ్యారేజీల నిర్మాణం వరకు అన్నీ ఆయ‌న క‌నుస‌న్నల్లోనే జ‌రిగాయ‌న తెలిపారు. ఇంజ‌నీర్ల‌కు ఆదేశాలు ఇచ్చింది కూడా కేసీఆరేన‌ని చెప్పారు.

అలాంట‌ప్పుడు.. అధికారుల‌ను బాధ్యుల‌ను చేసి.. కేసీఆర్ త‌ప్పుకొంటానంటే కుదురుతుందా? అని సీఎం ప్ర‌శ్నించారు. అన్ని ఆధారాలు ప‌క్కాగా ఉన్న‌ప్ప‌టికీ.. బీఆర్ ఎస్ నేత‌పైనా.. దీనికి స‌హ‌క‌రించిన హ‌రీష్‌రావుపైనా చ‌ర్య‌లు తీసుకునేందుకు.. క‌నీసం విచార‌ణ చేసేందుకు కూడా కేంద్రం స‌హ‌క‌రించ‌డం లేద‌ని విమ‌ర్శించారు. బీజేపీ నాయ‌కుల‌కు ఏమాత్రం బాధ్య‌త ఉన్నా.. కేసీఆర్‌.. అప్ప‌టి జ‌ల‌వ‌న‌రుల మంత్రి హ‌రీష్‌రావును జైల్లో పెట్టిన త‌ర్వాతే మాట్లాడాల‌ని రేవంత్ వ్యాఖ్యానించారు.

నా పాత్ర ఉంటే..

కాళేశ్వ‌రం అవినీతిలో ఎవ‌రికి భాగ‌స్వామ్యం ఉన్నా వ‌ద‌ల‌వ‌ద్ద‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సీబీఐ విచార‌ణ‌లో త‌న పాత్ర‌కానీ.. త‌న కుటుంబం పాత్ర‌కానీ.. ఉంటే.. దానికి కూడా వెనుకాడ‌వ‌ద్ద‌ని చెప్పారు. ల‌క్ష‌ల కోట్ల ప్ర‌జ‌ల సంప‌ద‌ను సొంతం చేసుకుని.. ఇప్పుడు క‌ల్ల‌బొల్లి క‌బుర్లు.. విమ‌ర్శ‌ల‌తో కాలం వెళ్ల‌దీస్తామంటే కుద‌ర‌ద‌ని వ్యాఖ్యానించారు. తెలంగాణ సంపదను నాశనం చేసిన వారు ఎవరైనా సరే.. వారు ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా చట్టానికి లోబడి శిక్ష అనుభవించాల్సిందేనని తేల్చి చెప్పారు.

This post was last modified on March 30, 2026 10:37 am

Share

Recent Posts

టాలీవుడ్‌లో ఇలాంటి కలయికలు అసాధ్యమా

నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…

53 minutes ago

హిందూపురం ఇలాకాలో… బాల‌య్యదే హ‌వా!

శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయ‌న అనుకూల…

57 minutes ago

కార్తీ అర్జెంటుగా అప్‌డేట్ కావాల్సిందే

మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…

2 hours ago

వైసీపీకి `విశాఖ` ఆశ‌లు గ‌ల్లంతే.. !

విశాఖ‌ప‌ట్నంలో జ‌ర‌గ‌నున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ ఆశ‌లు గ‌ల్లంత‌వుతున్నాయి. గ‌తంలో ఉన్న ప‌ట్టు.. ఇప్పుడు లేక‌పోవ‌డం.. గ‌తంలో సాయిరెడ్డి వంటి…

2 hours ago

సుహాస్ వాడకం ఇలా ఉండాలి

టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…

3 hours ago

పహల్గామ్‌పై బ్రిక్స్ ఒక్క మాట.. చైనా కూడా ఒప్పుకుంది!

పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్‌కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…

4 hours ago