Political News

వైసీపీ ఆణిముత్యం.. నానీ నోట అదే పాత క్యాసెట్

వైసీపీ త‌ర‌ఫున త‌ర‌చుగా మీడియా ముందుకు వ‌చ్చే మాజీ మంత్రి పేర్నినాని.. అమ‌రావ‌తి రాజ‌ధానిపై మ‌ళ్లీ పాత రికార్డే వినిపించారు. అమ‌రావ‌తిపై జ‌గ‌న్‌కు ధ్వేషం ఎందుకు ఉంటుందని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఆయ‌న ఏపీకి చెందిన నాయ‌కుడు కాదా?  ఏపీని ఐదు సంవ‌త్స‌రాలు పాలించ‌లేదా? ప్ర‌జ‌లు ఆయ‌న‌కు ఓటేయ‌లేదా? అని వ‌రుస ప్ర‌శ్న‌లు సంధించారు. అంతేకాదు.. అస‌లు చంద్ర‌బాబు కంటే కూడా జ‌గ‌నే రాజ‌ధాని ప్రాంతంలో ఇంటిని నిర్మించుకున్నార‌ని గుర్తు చేస్తూ.. పాత క్యాసెట్ రికార్డే ప్లే చేశారు.

తాజాగా ఏపీ అసెంబ్లీ అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించేందుకు.. ప్ర‌తిపాదించిన తీర్మానాన్ని ఏక‌గ్రీవంగా ఆమోదించింది. ఈ కార్యక్ర‌మాన్ని మ‌చిలీప‌ట్నంలోని త‌న కార్యాల‌యంలో ప్ర‌త్య‌క్షంగా వీక్షించిన పేర్ని నాని.. అనంత‌రం.. మీడియా ముందుకు వ‌చ్చారు. రాజ‌ధానికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త అనేది కేవ‌లం క‌ల్పిత డ్రామాగా ఆయ‌న అభివ‌ర్ణించారు. శాస‌న మండ‌లిని హాజ‌రు ప‌ర‌చ‌కుండా.. కేవ‌లం అసెంబ్లీని మాత్ర‌మే హాజ‌రు ప‌రిచి ఏక‌గ్రీవ తీర్మానం చేయ‌డం ఏంట‌ని నిల‌దీశారు. అస‌లు దీనికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త ఉందా? అని ధ‌ర్మ‌సందేహం వ్య‌క్తం చేశారు.

వైట్ పేప‌ర్ ప్లీజ్‌.. అంటూ పేర్ని నాని త‌న‌దైన శైలిలో వ్యాఖ్యానించారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌ధానిపై 21 వేల కోట్ల రూపాయ‌ల‌కు పైగానే ఖ‌ర్చు చేశార‌ని.. ఖ‌ర్చ‌యిన మొత్తానికి వైట్ పేప‌ర్ ఇవ్వాల‌న్నారు. కేవ‌లం జ‌గ‌న్‌ను తిట్టిపోయ‌డానికి మాత్ర‌మే స‌భ‌ను ప్ర‌త్యేకంగా హాజ‌రు ప‌రిచార‌ని పేర్కొన్నారు.

ఇక‌.. జ‌గ‌న్ పాల‌నా కాలంలోనే అమ‌రావ‌తిలో రోడ్డు నిర్మాణం పూర్త‌యింద‌ని చెప్పారు. “రాజ‌ధానిపై మ‌న‌సు ఉండ‌బ‌ట్టే జ‌గ‌న్‌.. మీకంటే ముందుగానే ఇక్క‌డ ఇల్లు క‌ట్టుకున్నాడు“ అని వ్యాఖ్యానించారు. రాజ‌ధానిలో అంద‌రూ బాగుండాల‌నే పేద‌ల‌కు ఇళ్లు కూడా కేటాయించారు.. అని తెలిపారు.

సీట్ల విషయంలోనూ..

మీరు 131 నుండి 23కు పడింది గుర్తు లేదా.. కేవలం మేము 151 ముందు 11కు పడింది మాత్రమే గుర్తుందా అంటూ లోకేష్ ను ప్రశ్నించారు. కూటమి 23 నుండి 164కు ఎలా వెళ్ళిందో వచ్చే ఎన్నికల్లో వైసీపీ 11 నుండి 170కు వెళ్లడం తథ్యమని బల్ల గుద్ది చెప్పారు. ఈ వ్యాఖలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పేర్ని నాని అంత ధీమా వ్యక్తం చేశారంటూ రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపడుతున్నారు.

ఈ వ్యాఖ్యలను ఎప్పటిలాగే ఇతర వైసీపీ నాయకులు సమర్థించగా.. పేర్ని నాని, వైసీపీ నాయకులు మళ్ళీ కలలు కంటున్నారని.. ఒకసారి 175కు 175 అని చెప్పుకున్నందుకే ప్రజలు 11 స్థానాలకు ప్రజలు సర్దిపెట్టారని ఈసారి అవి కూడా మిగలవని కూటమి నేతలు, అభిమానులు తిప్పి కొడుతున్నారు.

This post was last modified on March 28, 2026 11:34 pm

Share

Recent Posts

ఏఐ సినిమా… ఫోన్లో చూసి మురిసిపోవడమే

మొన్నటిదాకా ఇండస్ట్రీలో ఒకటే గుసగుస. ఏఐ వచ్చేసిందిగా, ఇకపై గ్రాఫిక్స్ కోసం కోట్లు తగలేయాల్సిన పనేముంది అని చాలామంది లెక్కలేసుకున్నారు.…

32 minutes ago

‘స్లమ్ డాగ్’ సౌండ్ ఎప్పుడు వినపడుతుంది

దర్శకుడు పూరి జగన్నాథ్ కొత్త సినిమా 'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్' విడుదల వ్యవహారం ఇంకా తేలలేదు. నిన్న…

45 minutes ago

జ‌గ‌న్‌కు ప‌ట్ట‌లేదు… లోకేష్ ప‌ట్టించుకున్నారు

వైసీపీ అధినేత జ‌గ‌న్ నివాసం ఉండే తాడేప‌ల్లి ప్రాంతం.. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఉంటుంది. ఇక్క‌డ అనేక మంది పేద‌లు.. దిగువ…

1 hour ago

మేన‌మామ ఉంగ‌రం విలువ 750 కోట్లు

రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమ‌లు చేస్తున్న ఉచిత ప‌థ‌కాల‌కు త‌మిళ‌నాడు కేరాఫ్‌గా ఉంది. నాటి జ‌య‌ల‌లిత, క‌రుణానిధి ప్ర‌భుత్వాల నుంచి నేటి…

3 hours ago

దుమారం రేపిన ద‌ర్శ‌కుడి తండ్రి ఇంట‌ర్వ్యూ

త‌మిళంలో పేరున్న ద‌ర్శ‌కుల్లో వెంక‌ట్ ప్ర‌భు ఒక‌రు. చెన్నై-28తో మొద‌లుపెట్టి చాలా హిట్లే ఇచ్చారు. చివ‌ర‌గా విజ‌య్ హీరోగా గ్రేటెస్ట్…

3 hours ago

సీట్లన్నీ గెలిచినా ఈవీఎంలకు వ్యతిరేకమే

ఎలక్ట్రానికి ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లపై చాలా సంవత్సరాలుగా చర్చ నడుస్తోంది. ఈవీఎంలు ట్యాంపర్ చేయడం సాధ్యమేనని కొందరు ప్రోటోటైప్ ఈవీఎంలను ట్యాంపర్…

3 hours ago