Movie News

పాపం కాదు… బాగుంది ప్రయత్నం అనిపించాలి

తిరువీర్ అంటే రెగ్యులర్ సినిమాలు చూసే ప్రేక్షకులకు సుపరిచితుడే కానీ సెలెక్టివ్ గా థియేటర్లకు వెళ్లే వాళ్లకు మాత్రం కొంచెం కొత్తగా అనిపిస్తాడు. మసూద మంచి హిట్ అయినప్పటికీ గుర్తింపు విషయంలో టీమ్ మొత్తం సమానంగా షేర్ తీసుకోవడంతో తను ఎక్కువగా హైలైట్ కాలేకపోయాడు. అయినా క్రమం తప్పకుండా మూవీస్ చేస్తూ జనం దృష్టిలో పడేందుకు కష్టపడతాడు. గత ఏడాది విడుదలైన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోకు ప్రశంసలు, గద్దర్ అవార్డు వచ్చినా డబ్బులు పెద్దగా రాలేదు.

వచ్చే నెల ఏప్రిల్ 17 పాపం ప్రతాప్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. తిరువీర్ ఒక విషయంలో చాలా ఓపెన్ గా ఉంటున్నాడు. ఫిల్టర్ లేకుండా తన గురించి చెప్పేస్తున్నాడు. విజయవాడ ఫ్లైట్ లో వెళ్ళినప్పుడు తోటి ప్రయాణికుడు గుర్తు పట్టకపోవడం, అనంతపూర్ లో భగవంతుడు షూటింగ్ టైంలో ఒక వ్యక్తి వచ్చి తిరువీర్ నే ఎవరు హీరో అని అడగటం లాంటి సంఘటనలు మీడియాతో షేర్ చేసుకున్నాడు. మాసూద చైల్డ్ ఆర్టిస్టు తిరువీర్ ని డ్రైవర్ అనుకుందట.

ఇలా ఓపెన్ గా ఉన్న తిరువీర్ కి అత్యవసరంగా సక్సెస్ కావాలి. ఈటీవీ విన్ ప్రొడక్షన్ కావడంతో పాపం ప్రతాప్ మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు. కాన్సెప్ట్ ఏదో వెరైటీగానే ఉంది. భగవంతుడులో చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ చేస్తున్నాడు. అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తున్న గువ్వలచెరువు ఘాట్ వెబ్ సిరీస్ లో కిరణ్ అబ్బవరంతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఇలా డైరీ చాలా బిజీగా ఉంది కానీ ఎటొచ్చి పెద్ద స్థాయిలో ఇమేజ్ రావడం కోసం ఎదురు చూస్తున్నాడు.

సో పాపం ప్రతాప్ ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి. ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ కాబట్టి కంటెంట్ కనక వర్కౌట్ అయితే తను కోరుకున్నది జరగొచ్చు. ఎవరైనా సరే ఇండస్ట్రీలో మాట్లాడేది సక్సెసే. అది వస్తూ ఉంటేనే జనాలతో కనెక్టివిటీ కొనసాగుతుంది. రెగ్యులర్ కాకుండా వైవిధ్యమున్న పాత్రలు చేస్తున్న తిరువీర్ కి ఈ ఏడాది రెండు థియేటర్ రిలీజులు, ఒక ఓటిటి కంటెంట్ ఎలాంటి ఫలితాలు ఇస్తాయో వేచి చూడాలి. ఏదీ రెగ్యులర్ జానర్ కాకపోవడం విశేషం.

This post was last modified on March 26, 2026 3:12 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

2 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

4 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

4 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

6 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

6 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

6 hours ago