Political News

అవమానాలే మిగిలాయా.. జీవన్ రెడ్డి బిగ్ డెసిషన్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. అనేక అవమానాలు, అనుమానాలు, సందేహాల మధ్య పార్టీలో కొనసాగలేమని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, “నా రాజకీయ జీవితానికి మీ తోడు కావాలి. మీ మార్గదర్శనం కావాలి” అంటూ కార్యకర్తలను ఉద్దేశించి జీవన్ రెడ్డి ఆదివారం సాయంత్రం బహిరంగ లేఖ రాశారు. ఇందులో అనేక అంశాలను ప్రస్తావించారు.

గత 20 నెలలుగా తనను అన్ని విధాలా అవమానాలకు గురి చేస్తున్నారని, తనపై నమ్మకం లేని విధంగా వ్యవహరిస్తున్నారని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. అయితే ఆయన ఎవరి పేరును నేరుగా ప్రస్తావించకపోవడం గమనార్హం. అయినప్పటికీ పార్టీ కార్యకర్తలు, వ్యక్తిగతంగా తనను అభిమానించే వారి కోసం వాటిని భరించానని చెప్పారు. కానీ చివరకు పార్టీ కార్యకర్తలకే అవమానాలు ఎదురయ్యాయని, కష్టానికి తగిన ఫలితం లేకుండా పోయిందని అన్నారు. అందుకే ఇక కాంగ్రెస్‌ను వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు జీవన్ రెడ్డి వెల్లడించారు. ఇది తన వ్యక్తిగత నిర్ణయం కాదని చెప్పారు. పార్టీ కార్యకర్తలు, తనను అభిమానించే వారి సూచనలు, సలహాలు, వారి భవిష్యత్తు కోసం, నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అవమానాలు భరిస్తూ పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, జీవన్ రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరే అవకాశాలపై ఇప్పటికే చర్చ జరుగుతోంది.

జగిత్యాల జిల్లాకు చెందిన తాటిపర్తి జీవన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం తెలుగు దేశం పార్టీతో ప్రారంభమైంది. 1983లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జగిత్యాల నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రి పదవి కూడా నిర్వహించారు.

ఆ తర్వాత 1989లో కాంగ్రెస్ పార్టీలో చేరి అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే పార్టీలో కొనసాగారు. తన రాజకీయ జీవితంలో మొత్తం 11 ఎన్నికల్లో పోటీ చేసి 6 సార్లు గెలుపొందారు. ఒకసారి ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్లలో మంత్రి పదవులు నిర్వహించారు.

ఇటీవల అంతర్గత విభేదాలు, ఎమ్మెల్సీ పునర్నియామకం లేకపోవడం, ఇతర నాయకులకు ప్రాధాన్యం పెరగడం వంటి కారణాలు జీవన్ రెడ్డిని అసంతృప్తికి గురి చేశాయి. వివాద రహిత నాయకుడిగా పేరొందిన ఆయన ప్రజానాయకుడిగా కూడా గుర్తింపు పొందారు.

This post was last modified on March 22, 2026 9:19 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

2 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

3 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

3 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

5 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

5 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

5 hours ago