ఉద్యోగార్థులకు ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. మొత్తం 10,060 పోస్టులతో ఈ క్యాలెండర్‌ను విడుదల చేసినట్లు ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం ఉగాదిని పురస్కరించుకుని జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం సంతోషంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని అన్నారు. యువతకు పారదర్శకంగా, సమయపాలనతో ఉద్యోగావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 10,060 ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు ఎప్పుడు విడుదలవుతాయో, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తామో స్పష్టంగా తెలియజేస్తూ ఈ క్యాలెండర్‌ను రూపొందించినట్లు తెలిపారు. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి ప్రకటించిన అన్ని పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.
నియామక ప్రక్రియలో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా 16 వేల ఉపాధ్యాయ పోస్టులు, 6 వేల కానిస్టేబుల్ పోస్టులు, వివిధ శాఖల్లో మరో 9 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు మంత్రి వివరించారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతమైందని చెప్పారు.
ఉద్యోగార్థులు నైపుణ్యం పోర్టల్‌లో వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకుని నోటిఫికేషన్లు, పరీక్షల తేదీలు, ఇతర సమాచారం గురించి ముందుగానే అలర్ట్స్ పొందవచ్చని సూచించారు. పరీక్షల సిలబస్‌ను ముందుగానే ప్రకటించడం ద్వారా అభ్యర్థులు సమర్థంగా సిద్ధం కావడానికి సహకరిస్తామని తెలిపారు.
ప్రతి ఏడాది ఉగాదిని ఉద్యోగాల ప్రకటన పండగగా నిర్వహించాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. “నా మాట నేను నిలబెట్టుకున్నాను. ఇక మీ వంతు – పోటీ పరీక్షలకు సన్నద్ధం అవ్వండి. కృషి చేస్తే విజయం మీ సొంతం” అంటూ ఆయన యువతకు పిలుపునిచ్చారు. ఉద్యోగార్థులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.
This post was last modified on March 19, 2026 10:18 am
అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…