Trends

పరాభవ నామ సంవత్సరం అర్థం ఇదే..

నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే చాలామందికి ఓటములు, అవమానాలు ఎక్కువగా ఎదురవుతాయేమో అన్న అపోహ కలుగుతుంది. కానీ వాస్తవానికి ఈ పేరుకు అలాంటి ప్రతికూల అర్థం లేదని పండితులు స్పష్టం చేస్తున్నారు.

“పరాభవ” అనే పదాన్ని విభజిస్తే –
“పరా” అంటే పరాశక్తి, పరాభట్టారిక (లలితాదేవి),
“భవ” అంటే భవుడు, పరమశివుడు.

అంటే ఈ సంవత్సరం ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరుల కరుణ, ఆశీస్సులతో భక్తులు రక్షణ పొందుతారని ఆధ్యాత్మికంగా భావిస్తారు. అందువల్ల ఇది అపశకునం కాదు, దైవానుగ్రహాన్ని సూచించే శుభనామ సంవత్సరమని విశ్వాసం.

మామిడి తోరణాల అందం, వేపపువ్వుల పరిమళం, పచ్చని ప్రకృతి మధ్య తెలుగు సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఉగాది పర్వదినం ప్రతి ఇంటికి కొత్త ఆశలు నింపుతుంది. ఉగాది పచ్చడిలోని షడ్రుచులు (తీపి, చేదు, పులుపు, కారం, వగరు, ఉప్పు) మన జీవితంలోని సుఖదుఃఖాలను ప్రతిబింబిస్తాయి.

అందుకే ఈ పరాభవ నామ సంవత్సరంలోనూ జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలు, జయాపజయాలను సమానంగా స్వీకరిస్తూ స్థితప్రజ్ఞతతో ముందుకు సాగాలని పండితులు సూచిస్తున్నారు. నూతనోత్సాహంతో, సానుకూల దృక్పథంతో ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించాలి.

This post was last modified on March 19, 2026 10:19 am

Share

Recent Posts

మేన‌కోడ‌లి పెళ్లి జ‌గ‌న్ పొలిటిక‌ల్ ఇమేజ్‌ను శాసిస్తుందా ?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ఇమేజ్‌పై ఆయన మేనకోడలి పెళ్లి…

3 hours ago

సంచ‌ల‌నం: చోటా రాజ‌న్ నిర్దోషి!

ఎవ‌రి పేరు చెబితే.. రాజ‌కీయ నేత‌ల నుంచి అధికారుల వ‌ర‌కు వ‌ణికిపోయేవారో.. అలాంటి వ్య‌క్తి చోటా రాజ‌న్‌. మూడు ద‌శాబ్దాల…

5 hours ago

రాప్తాడు దారుణానికి ప్రేమ నిరాకరణే కారణమా?

రాప్తాడు జడ్పీ హైస్కూల్ లో బాలికపై అమానుష దాడి ఘటన ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే.…

8 hours ago

ఇది రజినీ ఒక్కడికే సాధ్యం

సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ఇప్పుడు 76 ఏళ్లు. ఈ వయసులోనూ బాక్సాఫీస్ దగ్గర ఆయన చూపిస్తున్న హవా అసామాన్యం. తమిళంలో…

8 hours ago

తెరపై హింసకు అడ్డుకట్ట వేయాల్సిందే

గత కొన్నేళ్లుగా ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత తెరమీద వయొలెన్స్ వికృత రూపాలు దాల్చింది. హత్యలు ఎంత దారుణంగా చేయొచ్చో…

10 hours ago

స్టార్ డైరెక్టర్… బాత్రూంలో పడి

బాలీవుడ్లో శనివారం తీవ్ర విషాదం నెలకొంది. స్టార్ డైరెక్టర్ సంజయ్ గుప్తా హఠాత్తుగా చనిపోయారు. ఆయన వయసు 57 ఏళ్లే.…

12 hours ago