ఏపీ రాజధాని అమరావతికి విగ్రహ శోభ వచ్చింది. ఇప్పటికే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఇదే అమరావతిలో తొలి విగ్రహం.. కాగా, ఇప్పుడు అమరజీవి, ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు భారీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. దీనిని ఆయన 126వ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు సోమవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సాధించేందుకు అమరజీవి చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. రాజధాని ప్రాంతంలోని శాఖమూరులో ఆయన విగ్రహం ఏర్పా టు చేయడం రాజధానికే వన్నెతెచ్చిందని చెప్పారు. రాష్ట్ర సాధన కోసం శ్రీరాములు 58 రోజులు దీక్ష చేసిన నేపథ్యాన్ని పురస్కరించుకుని 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.
రాజధానితో ఆటలా!
గత వైసీపీ ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయాలని ప్రయత్నించారని దుయ్యబట్టారు. మూడు రాజధానులు అంటూ.. అమరావతిని నాశనం చేసే ప్రయత్నాలు చేశారని అన్నారు. కానీ, ఇక్కడి రైతులు మూడేళ్లపాటు పోరాటం చేసి రాజధానిని నిలబెట్టుకున్నారని తెలిపారు. వారి త్యాగాలను కూడా ప్రభుత్వం మరిచిపోదని, రాజధాని నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు.
పొట్టి శ్రీరాములు విగ్రహం విశేషాలు..
మొత్తం ఎత్తు: 58 అడుగులు
వాడిన ఇత్తడి: 26 టన్నులు
వాడిన ఇనుము: 42 టన్నులు
సిమెంటు: రెండు లారీల లోడు
ఇసుక: 12 లారీలు
నిర్మాణానికి పట్టిన సమయం: 6 మాసాలు
This post was last modified on March 16, 2026 9:22 pm
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…