Movie News

దర్శకుడు కాబోతున్న కిరణ్ అబ్బవరం

హీరోలు దర్శకత్వం చేయడం కొత్త కాదు. స్వర్గీయ ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణలతో మొదలుకుని కమెడియన్లు ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏవీఎస్, ఎంఎస్ నారాయణ దాకా ఎందరో ఈ ప్రయత్నాలు చేసినవాళ్ళే. కొందరు సక్సెస్ అయ్యారు, మరికొందరు విజయాన్ని చూడలేకపోయారు. కానీ ఇప్పటి జనరేషన్లో ఇలాంటి రిస్క్ ఎవరూ చేయడం లేదు. రెండో తరానికి చెందిన సీనియర్లు చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ ఎవరూ దీని జోలికి వెళ్ళలేదు.

అయితే యూత్ హీరో కిరణ్ అబ్బవరం త్వరలోనే మెగా ఫోన్ చేపట్టబోతున్నట్టు లేటెస్ట్ అప్డేట్. తనే హీరోగా నటించబోయే మూవీలో యాక్షన్ కెమెరా చెప్పేందుకు రెడీ అవుతున్నాడని సమాచారం. సుధాకర్ చాగంటి నిర్మాతగా వ్యవహరించే ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చనున్నారు. కిరణ్ ఇదివరకే రచయితగా తన ముద్ర చూపించిన సంగతి తెలిసిందే. ఎస్ఆర్ కల్యాణమండపంకు రచన తనదే. ఇతర సినిమాల్లోనూ క్రియేటివ్ కాంట్రిబ్యూషన్ ఇస్తుంటాడు.

సిద్దు జొన్నలగడ్డ లాంటి వాళ్లకు కూడా రైటింగ్ స్కిల్స్ ఉన్నప్పటికీ దర్శకత్వం చేయాలనే ఆలోచనైతే చేయలేదు. ఇప్పుడు ప్రత్యేకంగా కిరణ్ ఈ దారి ఎంచుకోవడం అనూహ్యమని చెప్పాలి. నిర్మాతగా తిమ్మరాజుపల్లె టీవీని వచ్చే నెల విడుదల చేయబోతున్న కిరణ్ అబ్బవరంకు రాబోయే రోజుల్లో యాక్టింగ్, ప్రొడక్షన్, డైరెక్షన్ మూడింటిని బ్యాలన్స్ చేయడం ఒకరకంగా కత్తి మీద సామే. అందులోనూ ఆర్టిస్ట్ గా బిజీగా నాలుగైదు సినిమాలు చేస్తున్న టైంలో.

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. ప్రస్తుతం చెన్నై లవ్ స్టోరీ పూర్తి చేసే పనిలో ఉన్న కిరణ్ అబ్బవరం దాని రూపంలో మరో సాలిడ్ హిట్ వస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. కె ర్యాంప్ మంచి సక్సెస్ అయినప్పటికీ అన్ని వర్గాలను పూర్తి స్థాయిలో చేరలేదనే ఫీలింగ్ అభిమానుల్లో లేకపోలేదు. చెన్నై లవ్ స్టోరీతో అది నెరవేరుతుందని వాళ్ళ నమ్మకం. ఒకవేళ దర్శకుడిగా కూడా కిరణ్ అబ్బవరం హిట్టు కొడితే ప్రొడ్యూసర్లను తనకు డబుల్ ప్యాకేజ్ ఆఫర్ చేస్తారేమో.

This post was last modified on March 16, 2026 3:39 pm

Share

Recent Posts

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

23 minutes ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

1 hour ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

3 hours ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

3 hours ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

5 hours ago

మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…

5 hours ago