Political News

ఉగాది తర్వాత.. ఏ క్షణమైనా.. బాబు కీలక నిర్ణయం..!

ఈ నెల 19న జరిగే ఉగాది తర్వాత ఏ క్షణమైనా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుత మంత్రి వర్గాన్ని ప్రక్షాళన చేయాలని చూస్తున్నారు. పనిచేస్తున్న వారిని కొనసాగించినా.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఆయన పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసినట్టు కూడా తెలుస్తోంది. నాయకుల మధ్య వివాదాలు, విభేదాలతో సాగుతున్న మంత్రులను పక్కన పెట్టడం ఖాయమని అంటున్నారు.

ప్రస్తుతం మంత్రివర్గంలో 25 మంది ఉన్నారు. వీరిలో 7 నుంచి 9 మందిని తొలగించే అంశంపై క్లారిటీతోనే ఉన్నట్టు తెలుస్తోంది. వీరి స్థానంలో కొందరు కొత్తవారికి.. అదే సమయంలో సీనియర్లకు కూడా అవకాశం కల్పించే ఛాన్స్ ఉందని సమాచారం. అయితే పేర్లు ఇప్పటికే డిసైడ్ అయ్యాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మండలి నుంచి మంత్రులుగా ఎవరూ లేరు. ప్రస్తుతం ఉన్న మంత్రులు అందరూ ఎమ్మెల్యేలే. ఈ నేపథ్యంలో మండలికి కూడా ప్రాధాన్యం ఇస్తారని తెలుస్తోంది.

ఈ క్రమంలో సోము వీర్రాజు పేరు ప్రముఖంగా వినిపిస్తుండడం గమనార్హం. బీజేపీ సీనియర్ నేత అయిన సోమును ఖచ్చితంగా మంత్రివర్గంలోకి తీసుకునే ఆలోచన ఉన్నట్టు సమాచారం. అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి చెందిన వారిలో ఒకరిని కూడా మంత్రిని చేస్తారని అంటున్నారు. వీరిలో కన్నా లక్ష్మీనారాయణ (సత్తెనపల్లి) పేరు వినిపిస్తోంది. ఆయనను కాదని అంటే తూర్పుకు చెందిన మరో నేతకు అవకాశం దక్కే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

అదే సమయంలో ప్రస్తుతం మంత్రి వర్గం నుంచి బయటకు పంపించేవారి సామాజిక వర్గాలను హర్ట్ చేయకుండా అదే సామాజిక వర్గానికి చెందిన నాయకులను మంత్రులుగా తీసుకునే ఆలోచన చేస్తున్నారు. తద్వారా సామాజిక వర్గాలకు అసంతృప్తి లేకుండా చేయాలన్న వ్యూహంతోనూ చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు మహిళల సంఖ్యను ఈ దఫా పెంచే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. మొత్తంగా ఉగాది తర్వాత ఏ క్షణమైనా మార్పులు ఖాయమని తెలుస్తోంది.

This post was last modified on March 16, 2026 10:25 am

Share

Recent Posts

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

1 hour ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

3 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

3 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

4 hours ago

తమిళ రాజకీయాల్లోకి ఇంకో స్టార్?

జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…

4 hours ago

ట్రెండింగ్ సాంగ్ ‘జిలేబి’ని ఎవరు వాడుకుంటారో

ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…

5 hours ago