Political News

ఏపీలో స్పెషల్ ఆఫీసర్ల పాలన.. ఎక్కడంటే!

రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగియడంతో, కొత్త ఎన్నికలు జరిగే వరకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు 86 నగర పంచాయతీలు, 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికైన పాలకవర్గాలు తిరిగి బాధ్యతలు స్వీకరించే వరకు ఆయా స్థానాల్లో స్పెషల్ ఆఫీసర్లు పరిపాలన నిర్వహించనున్నారు.

స్పెషల్ ఆఫీసర్లు గరిష్టంగా ఆరు నెలలపాటు తమ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పెషల్ ఆఫీసర్లు వెంటనే బాధ్యతలు స్వీకరించాలని సూచించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్ గెజిట్‌లో ప్రచురించాలని కూడా ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

This post was last modified on March 11, 2026 7:57 am

Share

Recent Posts

పుష్ప విలన్ ‘ట్రబుల్’ కొత్తగా ఉందే

ఒక మీడియం బడ్జెట్ సినిమాకు రాజమౌళి ప్రెజెంట్స్ అని పడిందంటే అందులో విషయం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే…

4 minutes ago

జపాన్ ఓడినా టీమిండియా గెలవలేదు…

జపాన్‌పై రెండు పరుగుల తేడాతో గెలిచారు. కానీ ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా బ్యాటింగ్‌పై మళ్ళీ సందేహాలు మొదలయ్యాయి. భారత…

7 minutes ago

గిన్నిస్ బుక్కంటే క్రేజ్ తగ్గిందనుకోవాలా

ఒకప్పుడు గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డులో పేరు సంపాదించుకోవడమంటే అదో పెద్ద ఘనతగా భావించే వాళ్ళు. పెద్ద పెద్ద…

59 minutes ago

నంది అవార్డులు వచ్చేస్తున్నాయహో…

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం ప్రకటించే నంది అవార్డుల‌కు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డుల‌తో స‌మానంగా చూసేవారు.…

3 hours ago

ఆలస్యం జరిగింది ఇక ఆగడం ఉండదు

టాలీవుడ్ సినిమాలకు అదేం శాపమో అర్థం కాదు కానీ కొన్నింటికి ప్రభుత్వాల నుంచి జిఓలు సకాలంలో రావు, చివరి నిమిషం…

4 hours ago

వందేమాత‌రంపై కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్‌?

జాతీయ గేయం వందేమాత‌రం వ్య‌వ‌హారంపై జ‌రుగుతున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. దేశానికి స్వాతంత్రం రాక మునుపు నుంచి ఈ…

4 hours ago