Movie News

డైరెక్ట‌ర్ హైప్ ఇస్తుంటే… నాగ్ ఫ్యాన్స్‌కు టెన్ష‌న్‌

టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున వ‌రుస‌గా త‌మిళ న‌టులు, టెక్నీషియ‌న్ల‌తో ప‌ని చేస్తున్నాడు. గ‌త ఏడాది ధ‌నుష్‌తో క‌లిసి నాగ్ న‌టించిన కుబేర ఓ మోస్త‌రు ఫ‌లితాన్ని అందుకుంది. కానీ సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ సినిమా కూలీలో విల‌న్ పాత్ర పోషించిన నాగ్‌కు నిరాశ త‌ప్ప‌లేదు. ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల సినిమాకు ఓపెనింగ్స్ వ‌చ్చాయి కానీ.. కంటెంట్ ప‌రంగా కూలీ తీవ్ర నిరాశ‌కు గురి చేసింది.

నాగ్ పాత్ర విష‌యంలో ఎంతో ఊహించుకున్న అభిమానుల‌కు తీవ్ర నిరాశ త‌ప్ప‌లేదు. ఈ సినిమాలో నాగ్ క్యారెక్ట‌ర్ గురించి రిలీజ్ ముంగిట ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజ్ మామూలు హైప్ ఇవ్వ‌లేదు. చివ‌రికి చూస్తే.. అంత‌న్నాడింత‌న్నాడే.. పాట గుర్తుకొచ్చింది నాగ్ క్యారెక్ట‌ర్ చూసి.

త‌మిళ హీరోలు తెలుగు ద‌ర్శ‌కుల వైపు చూస్తుంటే.. నాగ్ చిత్రంగా వ‌రుస‌గా త‌న రెండో సినిమాను కూడా త‌మిళ దర్శ‌కుడితోనే చేయ‌డం ఒకింత ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. పైగా అది నాగ్ వందో సినిమా కావ‌డం గ‌మ‌నార్హం.

త‌మిళ యువ ద‌ర్శ‌కుడైన రా.కార్తీక్.. నాగ్ మైల్ స్టోన్ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా గురించి ఇప్ప‌టిదాకా ఎక్క‌డా మాట్లాడ‌ని రా.కార్తీక్.. తొలిసారి త‌మిళ మీడియాతో మాట్లాడాడు. అత‌ను నాగ్‌కు ఎల‌వేష‌న్ ఇచ్చాడు. నాగ్ వందో సినిమా చిత్రీక‌ర‌ణ ప్ర‌స్తుతం నాన్‌స్టాప్‌గా జ‌రుగుతోంద‌ని చెప్పిన కార్తీక్.. ఈ సినిమాలో నాగ్ సూప‌ర్ స్టైలిష్‌గా క‌నిపిస్తాడ‌ని చెప్పాడు.

శివ‌, రక్ష‌కుడు, కూలీ సినిమాల్లో ఎలా అయితే స్టైలిష్ అవ‌తారంలో క‌నిపించాడో.. అంతే అందంగా ఈ సినిమాలోనూ ఉంటాడ‌న్నాడు. ఈ సినిమాలో నాగ్ మ‌ల్టిపుల్ గెట‌ప్స్‌లో క‌నిపిస్తాడ‌ని కూడా కార్తీక్ వెల్ల‌డించాడు. వందో సినిమాకు తెలుగు ద‌ర్శ‌కుడిని కాక‌, త‌మిళుడైన త‌న‌నే ఎందుకు ఎంచుకున్నార‌ని అడిగితే.. నీతో నాకు ఓకే అని నాగ్ చెప్పిన‌ట్లు కార్తీక్ తెలిపాడు.

తన కెరీర్ ఆరంభంలోనే మ‌ణిర‌త్నం సార్‌తో గీతాంజ‌లి చేసిన విష‌యాన్ని నాగ్ గుర్తు చేసిన‌ట్లు కార్తీక్ వెల్ల‌డించాడు. నాగ్ గురించి కార్తీక్ ఇచ్చిన ఎలివేష‌న్ బాగుంది కానీ.. లోకేష్ క‌న‌క‌రాజ్‌లా విష‌యం త‌క్కువ బిల్డ‌ప్ ఎక్కువలా కాకుండా మంచి పాత్ర‌, సినిమాతో నాగ్ మైల్‌స్టోన్ మూవీని మెమొర‌బుల్‌గా మార్చాల‌ని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు.

This post was last modified on March 11, 2026 1:26 am

Share

Recent Posts

నంది అవార్డులు వచ్చేస్తున్నాయహో…

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం ప్రకటించే నంది అవార్డుల‌కు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డుల‌తో స‌మానంగా చూసేవారు.…

1 hour ago

వందేమాత‌రంపై కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్‌?

జాతీయ గేయం వందేమాత‌రం వ్య‌వ‌హారంపై జ‌రుగుతున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. దేశానికి స్వాతంత్రం రాక మునుపు నుంచి ఈ…

2 hours ago

కలెక్షన్ కింగ్ అందుకే వెనుక ఉన్నారా

ఒకప్పుడు కలెక్షన్ కింగ్ గా తొంభై దశకంలో స్టార్ హీరోలకు బలమైన పోటీ ఇచ్చిన మోహన్ బాబుకి ఇప్పటికీ ఫాలోయింగ్…

4 hours ago

జడల్ జమానాకు సెన్సార్ ట్విస్టులు

ప్యారడైజ్ సెన్సార్ అయిపోయింది. ఊహించినట్టే ఏ సర్టిఫికెట్ వచ్చింది. 2 గంటల 54 నిమిషాల సవారి జాతి ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు…

4 hours ago

ఇక పిఠాపురంలోనే పవన్ మకాం?

చాలా రోజుల తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనిపించారు. ప్రకృతి వైద్యం కోసం కేరళం వెళ్లి 20 రోజుల…

5 hours ago

టీమిండియాకు చెమటలు పట్టించిన జపాన్

జపాన్‌తో మ్యాచ్ అంటే టీమిండియా సులభంగా గెలుస్తుందని అనుకున్నారు క్రికెట్ ఫ్యాన్స్. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తడి…

5 hours ago