Political News

కాంగ్రెస్ నాయకులు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి

రెండు తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌కు ఆ పార్టీ అగ్ర‌నేత‌, లోక్‌స‌భ‌లో విపక్ష నాయ‌కుడు రాహుల్‌గాంధీ కీల‌క సూచన‌లు చేశారు. ఇగోల‌ను ప‌క్క‌న పెట్టి పార్టీ కోసం ప‌నిచేయాల‌ని సూచించారు. ఇగోల కంటే కూడా పార్టీనే ముఖ్య‌మని తేల్చి చెప్పారు. నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు సంయుక్తంగా పార్టీ కోసం ప‌నిచేయాల‌న్నారు. ఒక్కొక్క జిల్లా క‌మిటీ అధ్య‌క్షుడికీ పార్టీపై ప‌ట్టు అవ‌స‌ర‌మ‌ని, ఆదిశ‌గా పార్టీని బ‌లోపేతం చేయాల‌ని సూచించారు. ప్ర‌తి జిల్లాలోనూ డీసీసీ స్థాయిలో ప‌ది మందినైనా త‌యారు చేయాల‌ని పేర్కొన్నారు. తాజాగా వికారాబాద్‌లోని అనంత‌గిరిలో జ‌రిగిన డీసీసీల శిక్ష‌ణ త‌ర‌గ‌తిలో రాహుల్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ప్ర‌ధాని ప‌ద‌విపై..

ప్ర‌ధాన మంత్రిప‌ద‌విని తీసుకునేందుకు తాను రెడీగానే ఉన్నాన‌ని రాహుల్ చెప్పారు. ప్ర‌స్తుతందేశం క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉందన్నారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీ అమెరికా చేతిలో కీలు బొమ్మ‌గా మారుతున్నార‌ని చెప్పారు. అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం రైతుల పాలిట శాపంగా మారనుంద‌ని హెచ్చ‌రించారు. ఇజ్రాయెల్ ప‌ర్య‌ట‌న‌తోనూ ప్ర‌ధాని మోడీ సాధించింది ఏమీ లేద‌ని రాహుల్ వ్యాఖ్యానించారు. దేశంలో నిరుద్యోగం పెరుగుతోంద‌ని.. దీనిని ప‌రిష్క‌రించేందుకు కేంద్రం ప్ర‌య‌త్నించ‌డం లేద‌న్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌ధాని ప‌ద‌వి ద‌క్కితేనే దేశం బాగుప‌డుతుంద‌న్నారు. అయితే.. త‌న‌కు ఈ ప‌ద‌విపై వ్యామోహం లేద‌న్నారు.

మార్ష‌ల్ ఆర్ట్స్ అవ‌స‌రం!

కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌కు మార్ష‌ల్ ఆర్ట్స్ అవ‌స‌ర‌మ‌ని రాహుల్ గాంధీ అన్నారు. అనంత‌గిరిలో పార్టీ నాయ‌కులకు శిక్ష‌ణ ఇస్తున్న స‌మ‌యంలోనే ఆయ‌న మార్ష‌ల్ ఆర్ట్స్ చేసి చూపించారు. మార్షల్ ఆర్ట్స్ చేస్తూ డీసీసీ అధ్యక్షులకు క్లాస్ చెప్పారు.` జియు జిట్సు` అనే మార్షల్ ఆర్ట్‌లో మెళకువలను ఆయ‌న వివ‌రించ‌డం గ‌మ‌నార్హం. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. `మార్షల్ ఆర్ట్స్‌`ను వ్యక్తిగత జీవితంలో ఒక భాగం చేసుకోవాల‌ని సూచించారు. అదేవిధంగా `కాంగ్రెస్ ఐడియాలజీ`ని రాహుల్ వివ‌రించారు. ప్ర‌జ‌ల కోసం.. ప్ర‌జ‌ల చేత ఏర్ప‌డిన ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ‌, రాజ్యాంగం ప‌రిర‌క్ష‌ణే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ప‌నిచేస్తుంద‌న్నారు.

This post was last modified on March 3, 2026 5:05 pm

Share

Recent Posts

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

8 minutes ago

100 కోట్ల ప్రయాణాల స్త్రీ శక్తి!

ఏపీలో కూట‌మి స‌ర్కారు అమ‌లు చేస్తున్న స్త్రీ శ‌క్తి ప‌థ‌కం రికార్డ్ సృష్టించింది. గ‌త ఏడాది ప్రారంభించిన ఈ ప‌థ‌కం…

2 hours ago

నక్సలైట్ అడవుల్లో నవ్వుల ‘కళ్యాణ్’

అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…

2 hours ago

సంచలనం… లెజెండరీ ఇండియన్ కెప్టెన్ గుడ్‌బై

ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…

4 hours ago

బాబు పవన్ భేటీ… స్థానిక ముడి పడినట్టేనా?

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…

5 hours ago

గంప నిండా సినిమాలు… ఎక్కడయ్యా జనాలు

ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…

5 hours ago