వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు.. బూతుల నేతగా టీడీపీ నాయకులు ముద్దుగా పిలుచుకుని కొడాలి నాని సుదీర్ఘ కాలం తర్వాత.. మీడియా ముందుకు వచ్చారు. గత ఎన్నికల్లో గుడివాడలో ఓడిపోయిన తర్వాత..ఆయన అజాలేకుండా పోయారు. కొన్నాళ్లు అనారోగ్యం అని చెప్పారు. ఆ తర్వాత.. హైదరాబాద్‌లో చికిత్స తీసుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత .. అక్కడెక్కడో కనిపించినా.. ఆయన మీడియాకు దూరంగా ఉంటూ వచ్చారు.
తాజాగా మాజీ మంత్రి, ఇటీవల సీఎం చంద్రబాబుపై దుర్భాషలాడి జైలుకు కూడా వెళ్లి వచ్చిన అంబటి రాంబాబును కొడాలి నాని ఆదివారం సాయంత్రం పరామర్శించారు. నేరుగా గుంటూరులోని అంబటి నివాసానికి వచ్చిన కొడాలి ఆయనను పరామర్శించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం.. మీడియాతో మాట్లాడిన కొడాలి `రెడ్ బుక్`కు ఎవరూ భయపడడం లేదని చెప్పారు. రెడ్‌బుక్‌లు వంద రాసుకున్నా.. మాకేమీ కాదని వ్యాఖ్యానించారు.
కూటమి ప్రభుత్వం బెదిరింపులకుఎవరూ భయపడబోరని కొడాలి వ్యాఖ్యానించారు. అంబటి రాంబాబు కుటుంబాన్ని ప్రభుత్వం, పోలీసులు మనక్షోభకు గురి చేశారని అన్నారు. తను ఫ్రెస్ట్రేషన్‌లో చేసిన వ్యాఖ్యల విషయంలో రాంబాబు చింతించారని.. తర్వాత.. ఆయన క్షమాపణలు కూడా చెప్పారని అన్నారు. అయినప్పటికీ కక్ష పూరితంగా కేసు పెట్టి.. ఆయనను జైల్లో పెట్టారని విమర్శించారు. అంబటి ఇంటిపై రాళ్లు కర్రలతో దాడులు చేసి కార్లు, ఇంటి అద్దాలను ధ్వంసం చేసిన వారిని మాత్రం ప్రభుత్వం రక్షించిందని దుయ్యబట్టారు.
అది భ్రమ!
మంత్రి నారా లోకేష్ గురించి మాట్లాడుతూ.. కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడే వాళ్లు ఇక్కడ ఎవరూ లేరని అన్నారు. ఆయన రెడ్ బుక్‌లో జగన్ పేరు ఉందో లేదో ఆయనే మరిచిపోయాడంటే.. అది రెడ్ బుక్కేనా? ఇంకేమైనా బుక్కా? అని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి ఇలాంటి ఉడత బెదిరింపులకు భయపడబోరని వ్యాఖ్యానించారు. 2029లో ఎంత మంది కట్టకట్టుకుని వచ్చినా జగన్ ప్రభంజనాన్ని ఆయన గెలుపును ఎవరూ అడ్డుకోలేరని కొడాలి ధృమా వ్యక్తం చేశారు.
This post was last modified on March 2, 2026 1:10 pm
ప్రస్తుతం ఇండియాలో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే ఎక్కువమంది చెప్పే పేరు.. అనిరుధ్ రవిచందర్‌దే. పేరుకు తమిళ…
రాష్ట్రంలో మంగళగిరి నియోజకవర్గం అత్యంత కీలకంగా మారింది. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రసిడెంట్, విద్యా శాఖ మంత్రి నారా…
ఇంకో రెండు వారాల్లో దసరా పండగ రానుంది. సెలవుల సీజన్ కావడంతో పిల్లా పెద్ద అందరూ ఎదురు చూస్తున్నారు. బయ్యర్…
మొన్నటిదాకా ఇండస్ట్రీలో ఒకటే గుసగుస. ఏఐ వచ్చేసిందిగా, ఇకపై గ్రాఫిక్స్ కోసం కోట్లు తగలేయాల్సిన పనేముంది అని చాలామంది లెక్కలేసుకున్నారు.…
దర్శకుడు పూరి జగన్నాథ్ కొత్త సినిమా 'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్' విడుదల వ్యవహారం ఇంకా తేలలేదు. నిన్న…
వైసీపీ అధినేత జగన్ నివాసం ఉండే తాడేపల్లి ప్రాంతం.. మంగళగిరి నియోజకవర్గంలో ఉంటుంది. ఇక్కడ అనేక మంది పేదలు.. దిగువ…