Political News

హుటాహుటిన పేలుడు ప్రాంతానికి.. బాధితులకు బాబు అండ!

కాకినాడ జిల్లా సామర్లకోట సమీపంలోని వేట్లపాలెంలో సంభవించిన భారీ పేలుడు ఘటన రాష్ట్రం మొత్తాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. శనివారం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య జరిగిన ఈ విస్ఫోటనంలో తొలుత నలుగురు మృతి చెందినట్లు వార్తలు వచ్చినా, ఆ సంఖ్య సాయంత్రానికి 24 మందికి చేరింది. పది సంఖ్యలో బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు స్పందించారు. విజయనగరంలో పర్యటనలో ఉన్న ఆయన షెడ్యూల్ ప్రకారం సాయంత్రం వరకు అక్కడే ఉండాల్సి ఉంది. అయితే ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే తన విజయనగరం పర్యటనను ముగించుకుని కాకినాడకు బయలుదేరారు.

సాయంత్రం 6.30 గంటల సమయంలో ఆయన రోడ్డు మార్గంలో కాకినాడకు చేరుకుని అక్కడి నుంచి బాధిత ప్రాంతానికి వెళ్లారు. ఘటన స్థలిని కాలినడకన పరిశీలించిన చంద్రబాబు పేలుడు ఎలా సంభవించిందన్న విషయంపై కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. అలాగే అక్కడ చేపట్టిన సహాయక చర్యలపై అధికారులను ప్రశ్నించారు.

ఫ్లడ్ లైట్ల వెలుగులో..

సాయంత్రం 6.30 గంటలకు ఘటన ప్రాంతానికి చేరుకున్నప్పటికీ ఆ ప్రాంతం పొలాల మధ్య ఉండడం, విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో పర్యటన చీకటిలోనే సాగింది. అధికారులు వెంటనే ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేశారు. ఆ వెలుగులోనే చంద్రబాబు ప్రతి మూలను పరిశీలించారు. కుప్పకూలిపోయిన షెడ్లు, కాలిపోయిన వాహనాలను పరిశీలించారు. చంద్రబాబు వెంట మంత్రి అనిత, బీజేపీ రాష్ట్ర చీఫ్ మాధవ్ కూడా పాల్గొన్నారు.

ఆదుకుంటాం: పవన్

బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ ఘటన ఎంతో కలచివేసిందని అన్నారు. పేలుడుకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. ఈ విషాద ఘటన అనేక కుటుంబాల్లో తీవ్ర దుఃఖాన్ని నింపిందని, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. పార్టీ తరఫున జనసైనికులు అవసరమైన సహాయం అందించాలని ఆయన సూచించారు.

This post was last modified on February 28, 2026 9:18 pm

Page: 1 2 3 4 5 6 7 8 9 10

Share

Recent Posts

ట్రెండింగ్ సాంగ్ ‘జిలేబి’ని ఎవరు వాడుకుంటారో

ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…

60 minutes ago

జ్ఞానేష్ కుమార్‌ను ఇప్పటికిప్పుడు తొలగించలేం

కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చ‌రిక చేసింది. ఆయన త‌ప్పు చేసిన‌ట్టు నిరూపిత‌మైతే.. క‌చ్చితంగా…

2 hours ago

మళ్లీ మొదలైన కొలికపూడి పంచాయితీ

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…

2 hours ago

ట్విస్టులు ఆర్టిఫీషియల్ ఉంటే ఎలా

హిందీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల వసూళ్లు 270 కోట్లకు పైగా నమోదు కావడం…

2 hours ago

దాదా వెనక్కు తగ్గే ఉద్దేశంలో లేడా?

షూటింగ్ సమయంలో ప్రమాదం వల్ల గాయపడిన నందమూరి బాలకృష్ణ కోలుకున్నారు. సుమారు రెండు నెలలు విశ్రాంతిలో ఉండి మళ్ళీ సినిమాలతో…

3 hours ago

రిలేషన్ సరే… కంటెంట్ రివీల్ చేయండి

దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి చేతిలో కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉన్నాయి. ట్రైలర్…

3 hours ago