అగ్రశ్రేణి కథానాయకులు.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు చేసే దర్శకులతో.. కొత్తవాళ్లు, పెద్దగా అనుభవం లేని డైరెక్టర్లతో పని చేయడం అరుదే. ఐతే మహేష్ బాబు కెరీర్లో ఇలాంటి సాహసాలు కొన్ని చేశాడు. బాబి, నిజం, నాని, అతడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సర్కారు వారి పాట.. ఈ చిత్రాలు చేసినపుడు వాటి దర్శకులు కొత్తవాళ్లు, లేదా పెద్దగా అనుభవం లేనివాళ్లు లేదా మిడ్ రేంజ్ సినిమాలు చేసుకుంటున్న వాళ్లే.
ఐతే ఈ దర్శకులతో పోలిస్తే అజయ్ భూపతి చిన్న స్థాయి దర్శకుడే. టాలీవుడ్ సర్ప్రైజ్ హిట్లలో ఒకటైన ఆర్ఎక్స్ 100తో అతను దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఐతే ఆ సినిమా రేంజ్ ఏంటి అన్నది చూడకుండా.. అందులో అజయ్ టాలెంట్ మాత్రమే చూసిన మహేష్.. తనతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడట. వీళ్లిద్దరి మధ్య సంప్రదింపులు కూడా జరిగాయట. ఈ విషయాన్ని అజయ్ భూపతి తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
ఆర్ఎక్స్ 100 సినిమాకు మహేష్ బాబుకు బాగా నచ్చి.. దాని గురించి తనతో చర్చించినట్లు అజయ్ తెలిపాడు. ఆ సందర్భంగా తనతో సినిమా చేయడానికి కూడా ఆయన రెడీ అయ్యాడని, కథ కూడా చెప్పమన్నాడని అజయ్ చెప్పాడు. అప్పుడు తాను శ్రీకృష్ణదేవరాయలిపై తన దగ్గర ఉన్న కథను ఆయనకు చెప్పానని.. కానీ ఇలాంటి పీరియడ్ మూవీ కాకుండా, మంచి కమర్షియల్ కథ ఉంటే చెప్పమని మహేష్ అడిగాడని.. కానీ ఆయన కోరుకున్న కథను ఆ సమయానికి తాను రెడీ చేయలేకపోవడంతో సూపర్ స్టార్‌తో పని చేసే అవకాశం రాలేదని అజయ్ వెల్లడించాడు.
ఆర్ఎక్స్ 100 లాంటి చిన్న సినిమా చేసిన దర్శకుడితో మహేష్ బాబు సినిమా చేయాలనుకోవడం డేరింగ్ స్టెప్పే. బహుశా సర్కారు వారి పాట చేయడానికి ముందు దొరికిన ఖాళీలో మహేష్ ఈ ఆలోచన చేశాడేమో. ముందు అనుకున్న ప్రాజెక్టు ఒకటి మెటీరియలైజ్ కాకపోవడంతో మహేష్.. కథ, దర్శకుడి కోసం వెతికాడు. ఆ క్రమంలోనే పరశురామ్ అనుకోకుండా అవకాశం దక్కించుకున్నాడు. అందుకోసం నాగచైతన్యతో చేయాల్సిన సినిమాను కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు.
కానీ సర్కారు వారి పాట అంచనాలను అందుకోలేకపోయింది. ఒకవేళ మహేష్ నచ్చే కథతో వెళ్లి ఉంటే సర్కారు వారి పాట బదులు అజయ్ సినిమానే మహేష్ చేసేవాడేమో. మహేష్ అన్న కొడుకు జైకృష్ణ ఘట్టమనేని హీరోగా అజయ్ రూపొందించిన శ్రీనివాసమంగాపురం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on July 24, 2026 9:53 am
దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. మంగళవారం సాయంత్రం విజయవాడలో పర్యటించేందుకు వచ్చారు. తొలుత కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించుకున్న ఆయన.. అనంతరం..…
ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…
తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…
వంగవీటి రంగా వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన కుమారుడు వంగవీటి రాధా.. త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటారన్న…