Movie News

రామ రామా… ఇంకెన్ని బ్రేకులు స్వామీ

నాలుగు వేల కోట్లతో తీశామని గొప్పగా చెప్పుకున్న ప్యాన్ ఇండియా మూవీ రామాయణ ప్రమోషన్ల పరంగా వేస్తున్న అడుగులు ఎటెటో వెళ్తున్నాయి. ఈ రోజు ట్రైలర్ విడుదల కావాలి. దాని కోసం కోట్లాది మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంత భారీ బడ్జెట్ తో తీసిన విజువల్ వండర్ తాలూకు శాంపిల్ ఎలా ఉంటుందోనననే ఎగ్జైట్ మెంట్ తో 24 తేదీ ఎప్పుడెప్పుడు వస్తుందాని ఎదురు చూశారు. తీరా చూస్తే హఠాత్తుగా పోస్ట్ పోన్ అంటూ చావు కబురు చల్లగా చెప్పారు.

డిస్ట్రిబ్యూషన్ హక్కులు సోని సంస్థకు ఇవ్వడం వల్ల మార్కెటింగ్ ప్రణాళిక మారిందని, ఢిల్లీలో జరుగుతున్న నిరసనల వల్ల వాతావరణం సానుకూలంగా లేదని టీమ్ కారణాలు అయితే చెబుతోంది కానీ ట్రైలర్ లాంచ్ కి వాటికి లింక్ ఏమిటో అర్థం కాక సినీ ప్రియులు తల గోక్కుంటున్నారు. ఆల్రెడీ వారం క్రితమే మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఈవెంట్ చేసి మరీ నాలుగు నిమిషాల ట్రైలర్ చూపించేశారు కొందరు రహస్యంగా రికార్డు చేసిన క్లిప్స్ సోషల్ మీడియాలో తిరిగి వైరలయ్యాయి.

అలాంటప్పుడు వీలైనంత త్వరగా ట్రయిలర్ లాంఛనం జరిగిపోవాలి. కానీ టీమ్ ఉద్దేశాలు ఏమిటో అర్థం కావడం లేదు. మళ్ళీ ఏమైనా మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుందని భావించి రిపేర్లు చేస్తున్నారా లేక ఇంకేదైనా ప్లాన్ ఉందాని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. నితేశ్ తివారి దర్శకత్వం వహించిన రామాయణ మొదటి భాగం నవంబర్ 8 విడుదల దాదాపు ఫిక్స్ అయ్యింది. ఈ తేదీని ట్రైలర్ తో పాటు రివీల్ చేయాలనేది మేకర్స్ ముందుగా వేసుకున్న ప్రణాళిక.

సరే ఎప్పుడు వదులుతారో వాళ్ళ ఇష్టం కానీ వీలైనంత త్వరగా జనం ముందుకు తీసుకు వస్తే బాగుంటుంది. బజ్ పరంగా ఉపయోగం కలుగుతుంది. రన్బీర్ కపూర్, సాయిపల్లవి సీతారాములుగా నటించిన ఈ ఎపిక్ డ్రామాలో సన్నీ డియోల్ హనుమంతుడిగా, రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖగా, కాజల్ అగర్వాల్ మండోదరిగా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సినిమా విడుదల వాయిదా ప్రసక్తే లేదని ముంబై టాక్. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేతో పాటు థియేటర్ లాంచ్ చేసే అవకాశం ఉందట. 

This post was last modified on July 24, 2026 11:56 am

Share

Recent Posts

కంపెనీకి చివరి మెయిల్.. ఇంట్లో భార్యాభర్తల మృతదేహాలు!

భార్య పుట్టినరోజు నాడే ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అంతకుముందు ఉదయం ఆ ఉద్యోగి…

4 hours ago

దుల్కర్ సల్మాన్‌కు ఇక్కడే రాసిపెట్టి ఉంది

మామూలుగా పెద్ద స్టార్ల కొడుకులు సినీ రంగంలోకి అడుగుపెడితే.. తండ్రి పేరును వాడుకోవడానికే ప్రయత్నిస్తారు. తండ్రి రెఫరెన్సులను తమ సినిమాల్లో…

4 hours ago

ప్రభుత్వమే తెచ్చిన డేటింగ్ యాప్ కానీ…

యువత పెళ్లిళ్లకు దూరంగా ఉండడంతో సింగపూర్ ప్రభుత్వం మాత్రం ఓ కొత్త ప్రయత్నం మొదలుపెట్టింది. పెళ్లి చేసుకోవాలనుకునే యువతీ యువకులను…

5 hours ago

తెలుగు వాళ్లకు ఆయన చాలా స్పెషల్

వారం కిందటే భారతీయ సినీ పరిశ్రమ నానా పటేకర్ లాంటి గొప్ప నటుడిని కోల్పోయింది. ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉన్న ఆయన…

5 hours ago

రవితేజ రూటు పట్టిన అల్లరి నరేష్

ఇరుముడి బ్లాక్ బస్టర్ సక్సెస్ ఒక కొత్త ఫార్ములా సృష్టించింది. మాములుగా స్టార్ హీరోలు దేవుళ్ళ మాల వేసుకునే క్యారెక్టర్లు…

6 hours ago

అందరికీ న్యాయం చేసిన టీడీపీ

స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ వేగం పుంజుకుంది. మంచి ముహుర్తాలు ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు హడావుడిగా నామినేషన్లు…

6 hours ago