Movie News

విశ్వనాథ్ భాష లాజిక్ సరైనదేనా

వీరభద్రుడు / కరుప్పు బ్లాక్ బస్టర్ హిట్టుతో తిరిగి ట్రాక్ లోకి వచ్చిన హీరో సూర్య తక్కువ గ్యాప్ లోనే మరో కొత్త సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 14 విశ్వనాథ్ అండ్ సన్స్ విడుదల కానుంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిన ఈ లవ్ కం ఎమోషనల్ ఎంటర్ టైనర్ లో మమిత బైజు హీరోయిన్ గా నటించగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆన్ లైన్ లో తిరుగుతున్న వాయిదా వార్తలను ఖండిస్తూ టీమ్ ఆల్రెడీ ప్రమోషన్లు మొదలుపెట్టింది.  

దర్శకుడు వెంకీ అట్లూరి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విశ్వనాథ్ అండ్ సన్స్ కేవలం తమిళంలోనే తీశామని, ఆర్టిస్టు అంటే సూర్యకు ప్రైమ్ ఆడియన్స్ ఎక్కడ ఎక్కువ ఉంటారో, ఆ లాంగ్వేజ్ లో తీయడం వల్ల సౌకర్యం ఉంటుందని, అందుకే తెలుగులో డబ్బింగ్ మాత్రమే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. అయితే ధనుష్ సర్ ప్రస్తావన వచ్చినప్పుడు అది మాత్రం రెండు భాషల్లో తీశామని, రెండు గమనిస్తే మీకీ విషయం అర్థమవుతుందని అన్నారు. ఇక్కడే లాజిక్ మిస్ అవుతోంది.

సూర్యకు మెయిన్ టార్గెట్ తమిళం అయినప్పుడు ధనుష్ కు కూడా అంతేగా. ఇంకా చెప్పాలంటే మన దగ్గర ధనుష్ కంటే సూర్యకే ఎక్కువ ఫ్యాన్స్, గుర్తింపు ఉన్నాయి. కొన్ని రీ రిలీజులు ఎలా సెలెబ్రేట్ చేసుకున్నారో చూశాం. అలాంటప్పుడు రెండు భాషల్లో తీయాల్సింది ఎవరి సినిమా. ఇది బేసిక్ క్వశ్చన్. ఒక టాలీవుడ్ దర్శకుడిగా సూర్యని ఒప్పించి తెలుగులో కూడా తీయాల్సింది పోయి కేవలం తమిళంకే పరిమితం కావడం ఏమిటనేది మూవీ లవర్స్ ప్రశ్న.

సరే ఇది తప్పని ఎవరూ చెప్పలేరు కానీ సర్ తీసేటప్పుడు రాని ఇబ్బంది విశ్వనాథ్ అండ్ సన్స్ చవి చూడటం విచిత్రంగా ఉంది. పాతికేళ్ల అమ్మాయి నలభై వయసు దాటిన వ్యక్తిని ప్రేమించడమనే పాయింట్ తీసుకున్న వెంకీ అట్లూరి ఇలాంటి నేపథ్యంతో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎలా మెప్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది. హిట్టు తర్వాత వస్తున్న సూర్య సినిమా కావడంతో బిజినెస్ పరంగా దక్షిణాది రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. కంటెంట్ తో మెప్పిస్తే మటుకు ఇంకో విజయం ఖాతాలో పడినట్టే. 

This post was last modified on July 24, 2026 11:59 am

Share

Recent Posts

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

3 hours ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

5 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

5 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

7 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

8 hours ago

రామాయణ అలసత్వం వల్ల ఎవరికి లాభం

సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…

9 hours ago