Political News

మద్యం కేసులో క్లీన్ చిట్.. స్పీడు పెంచనున్న కవిత

ఢిల్లీ మ‌ద్యం కేసులో త‌న‌ను నిర‌ప‌రాధిగా పేర్కొన్న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టుకు తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు.. క‌విత కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. తాను ఈ కేసులో టార్గెట్ అయ్యాన‌ని వ్యాఖ్యానించారు. తాను రాజ‌కీయ బాధితురాలిన‌ని పేర్కొన్నారు. ఒక‌రిపై ఉన్న అక్క‌సుతో నాపై కేసు బ‌నాయించి.. జైలుకు త‌ర‌లించార‌ని ఆమె ప‌రోక్షంగా బీఆర్ ఎస్ అధినేత‌పై వ్యాఖ్య‌లు చేశారు. తాను రాజ‌కీయం పావుగా మారాన‌న్నారు.

అయితే.. అప్ప‌ట్లోనే తాను.. క‌డిగిన ముత్యంగా బ‌య‌ట‌కు వ‌స్తాన‌ని చెప్పాన‌ని గుర్తు చేశారు. ఇప్పుడు అదే జ‌రిగింద‌న్నారు. త‌నకు సంబంధం లేక‌పోయినా.. త‌న‌ను ఇరికించార‌ని, జైలు పాలు చేశార‌ని అన్నారు. అయితే.. ఇప్ప‌టికైనా దేవుడు త‌న‌యందే ఉండి త‌న‌ను ఈ కేసు నుంచి బ‌య‌ట ప‌డేశాడ‌ని వ్యాఖ్యానించారు. ఇక నుంచి మ‌రింత ఉత్సాహంతో ప్ర‌జ‌ల మ‌ద్య‌కువెళ్తాన‌ని క‌విత చెప్పారు. ఈ కేసు విష‌యంలో త‌న‌కు ముందు నుంచి మ‌ద్ద‌తు తెలిపి వారికి ఆమె ధ‌న్య‌వాదాలు తెలిపారు.

ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉంటా!

ఇక నుంచి తాను ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉంటాన‌ని క‌విత చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌పై అభాండాలు మోపి.. త‌న‌ను ప్ర‌జ‌ల మ‌ధ్య చుల‌క‌న చేసిన రాష్ట్ర బీజ‌పీ నాయ‌కులు ఇప్పుడు ఏం స‌మాధానం చెబుతార‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌లతోనే ఇక నుంచి త‌న జీవితం ముడి ప‌డి ఉంటుంద‌న్నారు. త్వ‌ర‌లోనే సొంత పార్టీకి సంబంధించిన మ‌రిన్ని విష‌యాల‌ను వెల్ల‌డించ‌నున్న‌ట్టు తెలిపారు. మేలోనే పార్టీ పెడ‌తాన‌ని ఇటీవ‌ల ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఇక నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉంటాన‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on February 27, 2026 3:27 pm

Share

Recent Posts

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

20 minutes ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

1 hour ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

2 hours ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

3 hours ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

5 hours ago

మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…

5 hours ago