Political News

బాబు ఎఫెక్ట్.. ఏపీకి మరో బడా కంపెనీ

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వ‌స్తున్న సంస్థ‌లు కూట‌మి ప్ర‌భుత్వం ప‌ట్ల‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ట్ల అత్యంత విశ్వ‌స‌నీయ‌త ప్ర‌ద‌ర్శిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా మ‌రో విదేశీ సంస్థ కూడా పెట్టుబ‌డులు పెట్టేందుకు వ‌స్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. చంద్ర‌బాబు ఆహ్వానం మేర‌కు.. ఆయ‌న‌పై ఉన్న న‌మ్మ‌కంతో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఏపీకి త‌ర‌లి వ‌స్తున్నామ‌ని తెలిపింది. ఇది త‌మ‌కు ల‌భించిన గొప్ప అవ‌కాశంగా భావిస్తున్న‌ట్టు పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

అమెరికా-జ‌పాన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన `ప్రొటీరియ‌ల్‌` సంస్థ ఏపీలో `మెట్ గ్లాస్ ఇండియా` పేరుతో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చింది. ఈ సంస్థ అల్లాయ్ రిబ్బ‌న్ల‌ను ఉత్ప‌త్తి చేయ‌నుంది. 77 కోట్ల రూపాయ‌ల‌ను పెట్టుబడిగా పెట్ట‌నున్న ఈ సంస్థ‌.. తిరుప‌తి జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతం శ్రీసిటీలో త‌న విభాగాన్ని ఏర్పాటు చేయ‌నుంది. దీనికి సంబంధించి గ‌త ఏడాదే ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందం మేర‌కు తొలి రెండేళ్ల‌పాటు ప‌న్నులు మిన‌హాయిస్తారు. స్థానికంగా ఉన్న యువ‌త‌కు ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించాల్సి ఉంటుంది.

శ్రీసిటీలో ఈ సంస్థ `ఎలక్ట్రికల్‌ స్టీల్‌ సిటీ` కర్మాగారం ఏర్పాటు చేయనుంది. దీని నుంచి ఉత్ప‌త్తి అయ్యే అల్లాయ్ రిబ్బ‌న్ల‌ను దేశ‌, విదేశాల‌కు ఎగుమ‌తి చేయ‌నున్నారు. ప్ర‌ధాన వ్యాపారం అంతా విదేశాల కేంద్రంగానే సాగ‌నుంది. మొత్తం తొలిద‌శ‌లో 200 మంది స్థానికుల‌కు ఉద్యోగాలు, ఉపాధి క‌ల్పించ‌నున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌ నుంచి సంస్థ కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. అధునాతన జపాన్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ ప్లాంట్‌లో వినియోగించ‌నున్నారు.

ఇదిలావుంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు 13 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల మేర‌కు పెట్టుబ‌డుల‌పై కూట‌మి ప్ర‌భుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఇవి ఒక్కొక్క‌టిగా త‌మ సంస్థ‌ల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. వాటికి వివిధ ప్రాంతాల్లో భూములు కేటాయిస్తున్నారు. అదేవిధంగా ప‌లు రాయితీలు కూడా ప్ర‌క‌టిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే తాజాగా అమెరికా-జ‌పాన్ సంయుక్త సంస్థ ఏపీకి రావ‌డం గ‌మ‌నార్హం. ఈ ఏడాది మెజారిటీ ఒప్పంద సంస్థ‌లు ఏపీలో త‌మ త‌మ సంస్థ‌ల‌ను ఏర్పాటు చేయ‌నున్నాయ‌ని ఇటీవ‌ల మంత్రి నారా లోకేష్ వెల్ల‌డించారు.

This post was last modified on February 27, 2026 2:48 pm

Share

Recent Posts

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

1 hour ago

మల్టీస్టారర్ మూవీకి మర్చిపోలేని అవమానం

కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…

2 hours ago

ఆంధ్రా ముద్దుబిడ్డ అనంత్ అంబానీ

నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…

2 hours ago

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

3 hours ago

వివేకా కేసులో అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు

వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…

3 hours ago

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

4 hours ago