చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. తనకు మంత్రి పదవి ఇవ్వకుంటే ముఖ్యమంత్రిని అవుతానంటూ ఇటీవల ఆయన చేసిన కామెంట్లు రాజకీయ కాక రేపాయి. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి రేవంత్ ను డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
రేవంత్ రెడ్డి ఈ రెండేళ్లలో నిజాయతీగా పాలన చేయలేదని, అవినీతి లేకుండా పాలన జరగలేదని ఆరోపించారు. ఇక, అన్ని మంత్రిత్వ శాఖలు తన దగ్గరే రేవంత్ ఎందుకు పెట్టుకున్నాడని ప్రశ్నించారు. దేశ చరిత్రలో మరే సీఎం ఇలా ఇన్ని శాఖలు తన దగ్గర పెట్టుకోలేదని విమర్శించారు. ఇచ్చిన హామీలు ఎంత వరకు నెరవేర్చారో రేవంత్ చెప్పాలని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు నిజాయితీగా పని చేస్తున్నారా? అని నిలదీశారు.
మరోవైపు, కొందరు ఎమ్మెల్యేలతో రాజగోపాల్ రెడ్డి టచ్ లో ఉన్నారని, ఓ వర్గంగా విడిపోయి రేవంత్ సర్కార్ ను ఇరుకున పెట్టే యోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మంత్రి కాకుంటే ముఖ్యమంత్రి అవుతా అని రాజగోపాల్ చేసిన కామెంట్లపై కాంగ్రెస్ హై కమాండ్ సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది.
రాజగోపాల్ రెడ్డితో మాట్లాడి ఆయన అభ్యంతరాలు తెలుసుకుంటామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ అన్నారు. ఒకవేళ రాజగోపాల్ తో రాజీ విఫలమైతే ఆయనపై వేటు వేసేందుకు కూడా పార్టీ అధిష్టానం రెడీ అయిందని తెలుస్తోంది.
This post was last modified on February 21, 2026 11:26 am
సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…
ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…
నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…
రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…