Movie News

అంజికి ఒడిస్సికి కనెక్షన్ ఏంటి

అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే ఔను కదా అనిపిస్తాయి. బాక్సాఫిస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తున్న హాలీవుడ్ మూవీ ‘ది ఒడిస్సి’ ఏ స్థాయిలో ఆడుతోందో చూస్తున్నాం. ఒక్క ఇండియాలోనే వంద కోట్ల గ్రాస్ వైపు పరుగులు పెడుతున్న ఈ గ్రీక్ డ్రామా వచ్చే వీకెండ్ లో ఆ లాంఛనం పూర్తి చేసేలా ఉంది. వీక్ డేస్ లోనూ మెయిన్ థియేటర్లలో మంచి అక్యుపెన్సీలు నమోదు చేయడం పెద్ద విశేషం.

ఇక అసలు టాపిక్ లోకి వెళ్తే ది ఒడిస్సి క్లైమాక్స్ లో మాస్ ని ఊపేసిన సీన్ ఒకటుంది. ఇంటూ మార్కులో ఒకదాని వెనుక మరొకటి మహారాణి ఏర్పాటు చేసిన పన్నెండు జంట గొడ్డళ్ళ మధ్యలో నుంచి హీరో బాణం వదిలి గురిని అందుకునే సన్నివేశం థియేటర్ జనాలను బాగా ఊపేసింది. ముందు అక్కడున్న వాళ్ళు ట్రై చేసి తమవల్ల కాదని తప్పుకుంటే బిచ్చగాడి వేషంలో మొహం దాచుకున్న ఒడిస్సి దాన్ని చేసి చూపించి వావ్ అనిపిస్తాడు. తర్వాత శత్రువులను చంపేస్తాడు.

ఇదే తరహాలో అంజి ఇంట్రడక్షన్ సీన్ లో చిరంజీవి రమ్యకృష్ణ గాల్లో విసిరిన గాజుల మధ్యలో నుంచి బాణం వదిలి కుండ బద్దలు కొట్టి పందెం గెలుచుకుంటాడు. దీనికి ఒడిస్సికి పోలిక ఏమిటని కొందరికి నవ్వొచ్చినా దర్శకుడు కోడి రామకృష్ణ గారి విజన్ మూడు దశాబ్దాల క్రితమే ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. పురాతన గ్రీకు నవల నుంచే ఈ ఎపిసోడ్ ని వాడుకుని ఉండొచ్చు. అయితే దాన్ని తెలుగు ఆడియన్స్ ని టార్గెట్ చేసేలా మార్చుకుని మెప్పించడంలోనే సక్సెస్ ఉంది.

అప్పట్లో అంజి కమర్షియల్ ఫెయిల్యూరే కానీ గ్రాఫిక్స్ విషయంలో ఇప్పటికీ దాని గురించి మాట్లాడుకునే మూవీ లవర్స్ చాలా ఉన్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో శివలింగం చుట్టూ అల్లిన సీన్లు నభూతో నభవిష్యత్. అంత గొప్పగా ఉంటాయి. ఇప్పటికీ దాన్ని మ్యాచ్ చేసే ఘట్టాలు అరుదుగా కనిపిస్తాయి. అన్నట్టు చాలా కాలం నుంచి మెగాభిమానులు అంజి రీ రిలీజ్ డిమాండ్ చేస్తున్నారు కానీ నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి అంతగా ఆసక్తి చూపిస్తున్నట్టు లేదు. బహుశా సీజన్ లేదనేమో.

This post was last modified on July 21, 2026 5:56 pm

Share

Recent Posts

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

59 minutes ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

1 hour ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

2 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

10 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

12 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

12 hours ago