Movie News

బుట్టబొమ్మకు ఏ ప్రయోజనం లేదు

బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ భాషలో చేసినా బాక్సాఫీస్ ఫలితం మారడం లేదు. రజనీకాంత్ కూలిలో ఐటెం సాంగ్ చేస్తే ఆ పాట ఒక్కటే హిట్టయ్యింది కానీ దాని వల్ల కలిగిన బెనిఫిట్ సున్నానే. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమా జన నాయకుడులో ఆమె హీరోయిన్. బీస్ట్ తర్వాత మళ్ళీ ఈ కాంబో కుదిరింది. ఈ గురువారం విడుదలకు రంగం సిద్ధమయ్యింది.

అంతా బాగానే ఉంది కానీ జన నాయకుడు వల్ల పూజా హెగ్డేకు కలిగే లాభం ఏం లేదు. దర్శకుడు హెచ్ వినోత్ చెబుతున్న దాని ప్రకారం తన పాత్ర ఎడిటింగ్ వల్ల మొక్కుబడిగా మారిపోయింది. తొలుత జర్నలిస్టు క్యారెక్టర్లో ఎక్కువ సీన్లు రాసినప్పటికీ అన్ని షూట్ చేయలేకపోవడం, చేసిన వాటిలో కూడా లెన్త్ ఇష్యూ వల్ల కత్తిరించాల్సి రావడం జరిగాయట. ఒక ఇంటర్వ్యూలో ఆమెకు క్షమాపణ కూడా చెప్పాడు. ముఖ్యంగా సెకండాఫ్ లో పూజా కనిపించడం కొన్ని నిమిషాలేనని టాక్.

నిజానికి పూజా హెగ్డేకు చెప్పుకోదగ్గ హిట్టు దక్కి అయిదు సంవత్సరాలు దాటేసింది. ఇంత గ్యాప్ అంటే తిరిగి ఫామ్ లోకి రావడం కష్టం. అయినా సరే సూర్య, విజయ్, షాహిద్ కపూర్, సల్మాన్ ఖాన్, రణ్వీర్ సింగ్ లాంటి స్టార్ల సరసన ఛాన్స్ దక్కాయి. ఒక్కటి కూడా వర్కౌట్ కాలేదు. సరే రేంజ్ తగ్గినా పర్లేదని వరుణ్ ధావన్ తో హై జవానీతో ఇష్క్ హోనాహై చేస్తే అది కూడా దారుణంగా తుస్సుమంది. ఒకరకంగా చెప్పాలంటే తనను మన జనాలు మర్చిపోయారు.

ఇప్పుడు ఆశలన్నీ రాబోయే కాంచన 4 మీదే ఉన్నాయి. లారెన్స్ రాఘవేంద్ర భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ హారర్ మూవీలో పూజా హెగ్డే పాత్ర చాలా కీలకమట. అందుకే దెయ్యాల సినిమా అయినా ఓకే చెప్పిందని టాక్. దుల్కర్ సల్మాన్ తో చేస్తున్న శ్రీశ్రీ కూడా చివరి దశలో ఉంది. యూత్ ని టార్గెట్ చేసుకున్న ఈ ఎంటర్ టైనర్ లో కాంచన 4కి పూర్తి వ్యతిరేకమైన చక్కని అమ్మాయి పాత్ర చేస్తోంది. మరి ఈ రెండింటిలో ఏది బ్రేక్ ఇస్తుందో కాలమే సమాధానం చెప్పాలి.

This post was last modified on July 21, 2026 10:17 pm

Share

Recent Posts

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

13 minutes ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

8 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

10 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

10 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

11 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

11 hours ago