Political News

హ‌రీష్‌రావు కంచుకోట‌ను క‌విత బ‌ద్ద‌లు కొట్ట‌గ‌లదా?

బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి.. అంత‌కుమించి మాట‌ల మాంత్రీకుడు.. త‌న్నీరు హ‌రీష్ రావు గురించి చెప్ప‌డానికి ఇవి చాలు. అంతేకాదు.. సిద్దిపేట నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్ప‌టి వ‌రకు ఆయ‌న పోటీ చేసిన ప్ర‌తి సారీ విజయమే అందుకున్నారు.. త‌ప్ప‌.. ప‌రాజ‌యం అన్న‌మాటే లేదు. అలాంటి నాయ‌కుడి ఇలాకాలో పోటీ చేసేందుకు తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు.. క‌విత సిద్ధ‌మ‌వుతున్నారు.

ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆమె ప్ర‌క‌టించారు. పైకి ఆమె బోధ‌న్‌, సిద్దిపేట అని రెండు ఆప్ష‌న్లు చెప్పినా.. ఆమె ప్ర‌త్యామ్నాయం ఏంట‌నేది అంద‌రికీ తెలిసిందే. హ‌రీష్‌రావుపై గ‌త కొంత‌కాలంగా ‘గుంట న‌క్క‌’ అంటూ.. విరుచుకుప‌డుతున్న క‌విత‌.. బీఆర్ఎస్ పార్టీలో విధ్వంసం చెల‌రేగ‌డానికి ఆయ‌న‌ను కార‌కుడిగా పేర్కొంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌ను ప‌దే ప‌దే టార్గెట్ కూడా చేసుకున్నారు.

ఈ నేప‌థ్యంలో సిద్దిపేట నుంచి క‌విత పోటీ చేయ‌డం ఖాయం. అయితే.. ఈ నియోజ‌క‌వ‌ర్గం అంటే అంత ఆషామాషీకాదు.. హ‌రీష్ రావు పేరు చెబితే చాలు ఓట్లు రాలే నియోజ‌క‌వ‌ర్గం. అలాంటి చోట క‌విత‌.. త‌న అరంగేట్రంలోనే పోటీ చేస్తాన‌ని చెప్ప‌డంపై అంత ఈజీకాద‌ని.. రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఎందుకంటే.. గ‌తంలో త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంగా చెప్పుకొన్న నిజామాబాద్‌లోనే క‌విత ప‌ల్టీ కొట్టారు. ప‌రాజ‌యం పాల‌య్యారు.

ఆ త‌ర్వాత‌.. ఎమ్మెల్యే గా పోటీ చేసిన చోటా ప‌రాజ‌యం పాల‌య్యారు. కానీ, హ‌రీష్‌రావు అలా కాదే. 2023లో బీఆర్ఎస్‌కు తీవ్ర వ్య‌తిరేక గాలులు వీచిన‌ప్పుడు కూడా ఆయ‌న విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇప్ప‌టికీ ఆయ‌న పేరుకు వాల్యూ ఉంది. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఆయ‌న త‌ట్టుకుని నియోజ‌క‌వ‌ర్గాన్ని కాపాడుకున్నారు. అలాంటి నియోజ‌క‌వ‌ర్గంలో క‌విత ఏమేర‌కు పోరాటం చేస్తారు? ఏమేర‌కు నెగ్గుతారు? అనేది ప్ర‌శ్న‌. అయితే గియితే.. హ‌రీష్‌రావుపై ఉన్న అక్క‌సును మ‌రింత ప్ర‌ద‌ర్శించేందుకు పోటీ అనేది ఒక తురుపు ముక్క మాత్ర‌మే అవుతుందని చెబుతున్నారు.

This post was last modified on February 20, 2026 11:36 am

Share

Recent Posts

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

44 minutes ago

మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…

1 hour ago

కళ్యాణ్ గుండె ధైర్యం గట్టిదే

అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…

1 hour ago

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

3 hours ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

4 hours ago

ఐకానిక్ షోకు తెర‌… చివ‌రి సీజ‌న్లో అల్లు అర్జున్‌?

ఇండియాలో వివిధ భాష‌ల్లో అనేక టాక్ షోలు ఉన్నాయి. అందులో అత్యంత పాపుల‌ర్ ఏది అంటే బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత…

4 hours ago