Political News

ర్యాలీ పేరుతో అంబటి హడావిడి

రాజమండ్రి జైలు నుంచి 18 రోజుల రిమాండ్ అనంతరం విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరుకు ర్యాలీగా బయలుదేరగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజమండ్రి నుంచి ఆయన వాహనం కదిలిన వెంటనే మిగతా వాహనాలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ హైడ్రామా చోటుచేసుకుంది. మూడుకంటే ఎక్కువ వాహనాలు ఉండకూడదని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆందోళనకు దిగిన జక్కంపూడి రాజా సహా వైఎస్ఆర్సిపి నేతలు పోలీసుల తీరును ప్రశ్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అంబటి రాంబాబు వాహనం దిగి వెనక్కి వచ్చారు. అనంతరం పోలీసులు వాహనాలను క్లియర్ చేశారు.

ఈ సందర్భంగా అంబటి రాంబాబు పోలీసుల తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. రాష్ట్రంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. 18 రోజుల రిమాండ్ అనంతరం శాంతియుతంగా వెళ్తున్న వారిపై ఇలాంటి చర్యలు సరికాదని విమర్శించారు. ప్రజలంతా గమనిస్తున్నారని, ఇంతకన్నా తమను ఏమి ఇబ్బంది పెట్టగలరని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ తీరు దారుణమని ఆరోపించారు.

“నేను ర్యాలీగా వెళ్తే సెక్షన్ 30 వర్తిస్తుందా? నా ఇంటిని పగలగొట్టినప్పుడు సెక్షన్ 30 ఎక్కడుంది? ఆ రోజున నిబంధనలు ఏమయ్యాయి?” అంటూ ప్రశ్నించారు. రాజమండ్రి జైలు నుంచి పలువురు నేతలు ర్యాలీగా వెళ్లలేదా అని నిలదీశారు. అనుమతిస్తే కారులో వెళ్తానని, లేదంటే పాదయాత్రగా వెళ్తానని ప్రకటించారు. కొంతదూరం ఆగ్రహంతో నడుచుకుంటూ వెళ్లారు.

గుంటూరులో సెక్షన్ 30 అమలులో ఉన్న నేపథ్యంలో ర్యాలీగా రావొద్దని పోలీసుల నుంచి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేసిన పోలీసులు, అంబటి రాంబాబు వెంట భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఘటనతో రాజమండ్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

This post was last modified on February 19, 2026 10:54 am

Share

Recent Posts

సంచలనం… లెజెండరీ ఇండియన్ కెప్టెన్ గుడ్‌బై

ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…

2 hours ago

బాబు పవన్ భేటీ… స్థానిక ముడి పడినట్టేనా?

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…

3 hours ago

గంప నిండా సినిమాలు… ఎక్కడయ్యా జనాలు

ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…

3 hours ago

జనాలు పట్టేశాక నిజాలు ఒప్పుకుంటే ఎలా?

ఏదైనా కథ, పాత్ర, లేదా పాట విషయంలో పాత సినిమాల నుంచి స్ఫూర్తి పొందడం కొత్తేమీ కాదు. ఐతే అలా…

3 hours ago

త్రివిక్రమ్ బాధ్యత గురించి భేతాళ ప్రశ్న

నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా గురించి నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం…

4 hours ago

రియాలిటీకి దగ్గరగా ఉన్నా కామెంట్స్ తప్పలేదు

నిన్న కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' టైటిల్ రివీల్ టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అరిటాకులో భోజనాలు వడ్డించే ఒక…

4 hours ago