Movie News

హౌస్ ఫుల్, బ్లాక్ బస్టర్ అంతా ఉత్తిదేనా?

ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా మనిషైనా జనాలకు త్వరగా చేరాలంటే పబ్లిసిటీ అవసరం. లేదంటే ఉనికిని చాటుకోవడం కష్టం. సినిమాలకు మరీ మరీ ముఖ్యం. ముఖ్యంగా చిన్న బడ్జెట్ తో తీసి అష్టకష్టాలు పడే నిర్మాతలకు ఇది తప్పనిసరి. సోషల్ మీడియా వచ్చాక ఇది సరికొత్త రూపాలు సంతరించుకుంది. మీమర్స్ పుట్టుకొచ్చారు. లక్షలాది ఫాలోవర్స్ ఉన్న హ్యాండిల్స్ ప్రభావం పెరిగిపోయింది. ఇన్ఫ్లు యెన్సర్ల పేరుతో మీడియాకు పోటీ ఇచ్చే స్థాయిలో కొందరు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇదంతా ఒకవైపు.

ఈ ట్రెండ్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ హైప్ (కృత్రిమ ప్రచారం) అనే గాలిబుడగని సృష్టించింది. దీని ట్రాప్ లో ప్రొడ్యూసర్లు పడుతున్నారు. అంటే లేని బజ్ తీసుకొచ్చి ప్రేక్షకుల మెదళ్లలో తమ సినిమాని ఎలాగైనా రిజిస్టర్ చేయాలన్న ఉద్దేశంతో పెయిడ్ ప్రమోషన్ల కోసం లక్షలు ఖర్చు పెట్టేందుకు వెనుకాడటం లేదు. ఏదో ఒక ఇష్యూని హైలైట్ చేయడం ద్వారా ఎక్స్, ఇన్స్ టా తదితర మాధ్యమాల్లో వైరల్ కావడం ఈ స్ట్రాటజీలోని ప్రధాన ఉద్దేశం. తద్వారా ఆడియన్స్ ని సులభంగా ఆకట్టుకుని థియేటర్లకు వచ్చేలా చేయొచ్చని నిర్మాతలు భావిస్తున్నారు.

దీని కోసం గివ్ అవే పేరుతో వందలాది టికెట్లు ఉచితంగా పంచేస్తారు. ఊరు, థియేటర్ పేరు చెబితే చాలు టికెట్లు వచ్చేస్తాయి. మల్టీప్లెక్సులు, బిసి సెంటర్లలో బజ్ లేని సినిమాలకు షోలు క్యాన్సిల్ కాకుండా కాపాడేది ఇవే. ఫ్రీగా ఇచ్చినవి కాబట్టి దాదాపుగా అన్నీ హౌస్ ఫుల్ అవుతాయి. ఈ వీడియోలను షూట్ చేసుకొచ్చి ఇంత బ్రహ్మాండంగా ఓపెనింగ్స్ వచ్చాయని ఆఫీస్ దగ్గర బాణాసంచా కాల్చేసి సూపర్ హిట్ అని పోస్టర్లు వదులుతారు. నిజమేంటో అందరికీ తెలిసిందే. కాకపోతే పైకి ఎవరికి వారు అంతా నిజమనేలా నటిస్తారు.

కానీ జనాలు అంత అమాయకులు కాదు. ఫైనల్ గా మాట్లాడాల్సింది కంటెంటే. అది తేడా కొట్టిందంటే ట్విట్టర్ లో ఎన్ని బాకాలు ఊదినా, పొగడ్తల వర్షం గుప్పించుకున్నా థియేటర్లలో పబ్లిక్ ఉండరు. వాటి ఓనర్ల మొహాల్లో నవ్వులూ ఉండవు. కల్ట్ ముద్ర వేసి కొన్ని ప్రేమకథలను గొప్పగా ప్రచారం చేస్తారు. కట్ చేస్తే ఫ్యామిలీస్ కాదు కదా కనీసం కాలేజీ యువత కూడా అంతంత మాత్రంగానే వస్తారు.

కేవలం తమ ఈగోలను సంతృప్తిపరుచుకోవడానికో లేదా తాము గొప్ప సినిమా తీశామనే నమ్మకాన్ని సమర్ధించుకోవడానికో కొంతమంది నిర్మాతలు పదే పదే ఈ ఆర్టిఫీషియల్ హైప్ ని నమ్ముకోవడం ఎంత మాత్రం క్షేమం కాదు. ఏ హంగామా చేయకపోయినా కంటెంట్ బాగుంటే గొప్పగా ఆడిన సూపర్ హిట్స్ చరిత్రలో ఎన్నో ఉన్నాయి. వాటిలో ముక్కుమొహం తెలియని హీరోలు నటించినవి, స్టార్ ఇమేజ్ తో మార్కెట్ ని శాశించే బడా నటులు చేసినవీ ఉన్నాయి. ఆర్గానిక్ ప్రమోషన్లతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రేక్షకులు కూడా అంగీకరిస్తారు. అలా కాదని బలవంతంగా వాళ్ళ మెదళ్లలోకి ఏదో జొప్పించాలని చూస్తే రివర్స్ కావడం ఖాయం.

కోట్ల రూపాయల వసూళ్లు, బ్లాక్ బస్టర్ స్టాంపులు ఎన్ని వేసుకున్నా మొదటి రెండు మూడు రోజులు థియేటర్లకు వెళ్లిన జనాలకు సినిమాలో సత్తా ఎంత ఉందో తెలుస్తుంది. బాగుంటే అదే పబ్లిక్ టాక్ గా బయటికి వచ్చి వసూళ్ల వర్షం కురిపిస్తుంది. తేడా కొడితే అబ్బే ఏం లేదు, ఊరికే హంగామా చేస్తున్నారనే ప్రచారం తిరిగి అదే పబ్లిక్ నోటి ద్వారా అందరికీ చేరుతుంది. సో హైప్ తెచ్చుకోవడం తప్పు కాదు. కానీ క్రియేటివిటీ పేరుతో ఉత్తుత్తి హంగామాలు చేస్తూ పోతే మాత్రం భవిష్యత్తులో నిజమైన కంటెంట్ ని కూడా నమ్మకపోయే ప్రమాదముంది. నిర్మాతలు ఇది గుర్తించిన రోజు ఫేక్ ప్రాపగండాకు బ్రేకులు పడతాయి.

This post was last modified on February 19, 2026 11:13 am

Share

Recent Posts

నానీనే స‌వాల్ చేస్తున్న చిన్న హీరో

సంక్రాంతి, ద‌స‌రా లాంటి పెద్ద పండుగ‌ల‌ను ప‌క్క‌న పెడితే.. ఒక పెద్ద సినిమా రిలీజ‌వుతున్న‌పుడు చిన్న సినిమాలు పోటీలో ఉండ‌డం…

1 hour ago

ఆ భూములన్నీ తన కష్టార్జితమే అన్న కవిత!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బుధవారం సాయంత్రం అసెంబ్లీలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి చెందినవారు, ఆయన పార్టీకి…

1 hour ago

ఇక్కడ అమ్మాయి సుప్రియకు అదిరిపోయే పదవి!

ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…

3 hours ago

సంబరాలు అంత సాహసం చేస్తుందా

సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…

3 hours ago

కేసీఆర్ ఫ్యామిలీ భూముల లెక్క చూస్తే షాకే!

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…

3 hours ago

ఇలాంటి కొడుకులు కూడా ఉంటారు..

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…

4 hours ago