జగిత్యాల మునిసిపల్ పీఠం ఎట్టకేలకు కాంగ్రెస్‌పార్టీకే దక్కింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న స్తబ్దతకు చెక్ పెడుతూ.. కాంగ్రెస్ అదిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ జాతీయస్థాయి నాయకుడు సవాంగ్ ను రంగంలోకి దింపింది. దీంతో ఆయన ఎంట్రీ ఇచ్చి.. ఇరు వర్గాలుగా చీలిపోయిన కాంగ్రెస్ పార్టీ నేతలను ఏకతాటిపైకి తీసుకువచ్చారు.
అందరూ కలసి కట్టుగా పనిచేస్తేనే పార్టీకి ఫ్యూచర్ ఉంటుందని తేల్చి చెప్పారు. ఇదేసమయంలో సీనియర్ నేత జీవన్ రెడ్డి చెప్పినట్టుగా.. పార్టీకి ఆది నుంచి పనిచేస్తున్న వారికి గుర్తింపు, పదవులు ఇచ్చేందుకుపార్టీ రెడీ అయింది. దీంతో ఇక్కడ నెలకొన్న వివాదం సర్దుమణిగింది.
అసలేం జరిగింది?
జగిత్యాల మునిసిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి.. కాంగ్రెస్‌కు మద్దతుదారుగా మారిన ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ వర్గానికి పార్టీ నాయకత్వం టికెట్లు ఖరారు చేసింది. దీంతో అలకబూనిన సీనియర్ నేత.. జీవన్‌రెడ్డి.. తన వర్గాన్ని ఇండిపెండెంట్లుగా బరిలోకి దింపారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో సంజయ్ కుమార్ వర్గం కంటే కూడా.. జీవన్ వర్గంలో ఎక్కువ మంది విజయం దక్కించుకున్నారు. మరోవైపు బీఆర్ ఎస్, బీజేపీలు ఆశించిన మేరకు ఫలితం రాబట్టలేకపోయాయి. దీంతో ఇక్కడ హంగ్ ఏర్పడింది.
ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి-సంజయ్‌కుమార్ వర్గాలు కలిస్తే.. మునిసిపల్ పీఠాన్నిదక్కించుకునే అవకాశం కాంగ్రెస్‌కు ఏర్పడింది. కానీ, రెండురోజులుగా జరిగిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు పక్షాలను ఏకం చేసేందుకు పార్టీ ప్రయత్నించింది.
హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌కు తన వర్గం కౌన్సిలర్లతో వచ్చిన జీవన్ రెడ్డితో కాంగ్రెస్ హైకమాండ్.. చర్చించింది. చైర్మన్ పీఠం సంజయ్ వర్గానికి, వైస్ చైర్మన్ పదవి జీవన్ వర్గానికి ఇచ్చేందుకు సమ్మతించింది. దీంతో జీవన్ రెడ్డి ఓకే చెప్పారు. అదేసమయంలో కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆయన సూచనలకు కూడా పార్టీ ఓకే చెప్పంది. దీంతో జగిత్యాలలో నెలకొన్న వివాదం సర్దుమణిగింది.
This post was last modified on February 16, 2026 11:52 am
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…