Trends

టీమిండియా దెబ్బకు పాకిస్థాన్‌ చిత్తుగా..

టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా జరిగిన అత్యంత క్రేజీ ఫైట్‌లో టీమిండియా తన ఆధిపత్యాన్ని చాటుకుంది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను 61 పరుగుల తేడాతో చిత్తు చేసి భారత్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. స్పిన్నర్లకు స్వర్గధామం లాంటి ఈ పిచ్‌పై పాక్ ఐదుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగి భారీ ఆశలు పెట్టుకున్నా, మన బ్యాటర్ల ముందు వారి వ్యూహాలు పారలేదు. తెలివైన ఆటతీరుతో భారత్ మరోసారి దాయాదులపై పైచేయి సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. డ్యాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మా మొదట్లోనే వెళ్లినా మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ ఒక్కడే పాక్ బౌలర్లపై ఊచకోత కోస్తూ కేవలం 40 బంతుల్లోనే 77 పరుగులు రాబట్టాడు. సూర్యకుమార్ యాదవ్ (32), తిలక్ వర్మ (25) విలువైన పరుగులు జోడించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. పాక్ బౌలర్లలో సయిమ్ అయూబ్ 3 వికెట్లు తీసినా, భారత బ్యాటర్లను కట్టడి చేయడంలో మిగిలిన వారు విఫలమయ్యారు.

అనంతరం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్, భారత బౌలర్ల ధాటికి 18 ఓవర్లలోనే 114 పరుగులకు కుప్పకూలింది. పాక్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖాన్ (44) ఒక్కడే ఒంటరి పోరాటం చేసినా అతనికి మిగిలిన వారి నుంచి సహకారం అందలేదు. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేశారు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలో రెండు వికెట్లతో రాణించి పాక్ పతనాన్ని శాసించారు.

ఈ మ్యాచ్‌కు ముందు వాతావరణం, పిచ్ పరిస్థితులపై ఎన్నో చర్చలు జరిగినా మైదానంలో మాత్రం భారత్ ఏకపక్షంగా చెలరేగిపోయింది. ముఖ్యంగా పాక్ స్పిన్నర్ల ప్రభావం ఈ పిచ్‌పై ఎక్కువగా ఉంటుందని భావించినా, భారత బ్యాటర్లు వారిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. పాక్ బ్యాటింగ్ లైనప్ మన బౌలర్ల ముందు ఏమాత్రం నిలవలేకపోయింది. అంచనాలకు తగ్గట్టుగా ఈ పోరు హోరాహోరీగా సాగకపోయినా, భారత్ ప్రదర్శన మాత్రం అద్భుతమనే చెప్పాలి. ఈ విజయంతో టీమిండియా గ్రూప్-ఏలో 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి సూపర్-8 బెర్తును ఖాయం చేసుకుంది. వరుసగా అమెరికా, నమీబియా, ఇప్పుడు పాకిస్థాన్‌లపై గెలిచి టీమిండియా మంచి జోరు మీద ఉంది. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే ఈసారి వరల్డ్ కప్ మనదే అన్న ధీమా అభిమానుల్లో కనిపిస్తోంది.

This post was last modified on February 15, 2026 10:46 pm

Share

Recent Posts

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

9 seconds ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

35 minutes ago

ఎన్నికల ఫలితాలపై AI ప్రభావం

AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…

39 minutes ago

బుమ్రా తిరిగొచ్చాడు.. కానీ..

రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…

1 hour ago

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

4 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

4 hours ago