Movie News

తెలుగు సినిమాలో తెలుగమ్మాయిల జోరు

తెలుగు సినిమాల్లో తెలుగమ్మాయిలకు పెద్ద అవకాశాలు రావడం అరుదు. మన అమ్మాయిలంటే తెలుగు దర్శక నిర్మాతలకు చిన్నచూపు అని కొందరంటే.. తెలుగమ్మాయిలు సినిమాల్లోకి రావడమే తక్కువ, వచ్చినా ఆయా పాత్రలకు తగ్గట్లుగా అప్పీయరెన్స్ ఉండదు, కోరుకున్నట్లుగా నటించరు అని ఇంకొందరంటారు.

కారణాలు ఏవైనా సరే.. తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లకు ప్రాధాన్యం తక్కువ అన్నది మాత్రం వాస్తవం. కానీ ఇటీవల మన సినిమాల్లో తెలుగు హీరోయిన్ల జోరు కొంచెం పెరుగుతోంది. నిజానికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం నంబర్ వన్ హీరోయిన్ అని చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు. ఒకప్పుడు అనుష్క, కాజల్, తమన్నా, సమంతల్లా ఇప్పుడు ఎవ్వరూ వెలిగిపోవడం లేదు. హీరోయిన్ల కొరత కనిపిస్తోంది. ఇలాంటి టైంలోనే తెలుగమ్మాయిలు రైజ్ అవుతున్నారు.

‘బేబీ’ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించి బిజీ అయిపోయింది వైష్ణవి చైతన్య. ‘బేబీ’ తర్వాత లవ్‌మి, జాక్ సినిమాలు షాకిచ్చినా.. ఇప్పుడు ‘ఎపిక్’ లాంటి క్రేజీ మూవీలో నటిస్తోంది. ‘అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు’ చిత్రంతో కథానాయికగా పరిచయమైన శివాని నాగారం తన ప్రతిభను చాటుకుంది. ఆమెకు ‘లిటిల్ హార్ట్స్’ రూపంలో భారీ విజయం దక్కింది. ఇప్పుడు ‘హే భగవాన్’ లాంటి ప్రామిసింగ్ మూవీతో పలకరించబోతోంది శివాని. ఇది కూడా హిట్టయితే శివాని రేంజ్ మారిపోవచ్చు. 

ఇక హైదరాబాద్ అమ్మాయి, థియేటర్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన ఫరియా అబ్దుల్లా ‘జాతిరత్నాలు’తో పెద్ద హిట్ కొట్టింది. తర్వాత ఆమెకు అంతగా కలిసి రాకపోయినా సినిమాలకైతే లోటు లేదు. ఇటీవలే ‘గుర్రంపాపిరెడ్డి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె.. త్వరలోనే ‘గాయపడ్డ సింహం’ చిత్రంతో రాబోతోంది. తమిళంలోనూ ఆమె ఒక సినిమాలో నటిస్తోంది.

మరోవైపు శ్రీ గౌరీ ప్రియ ఇప్పుడు తమిళంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. జయం రవి లాంటి పెద్ద హీరోతో ‘బ్రో కోడ్’ సినిమా చేస్తున్న ఆమెకు అక్కడ ఇంకో రెండు సినిమాలున్నాయి. తెలుగులో ‘చెన్నై లవ్ స్టోరీ’ లాంటి క్రేజీ మూవీతో పాటు అశోక్ గల్లాతో ఓ సినిమాలో నటించింది గౌరీప్రియ. 

ఇప్పుడు తెలుగులో చర్చనీయాంశంగా మారిన ‘కపుల్ ఫ్రెండ్లీ’లో కథానాయికగా నటించిన మానస వారణాసి సైతం అచ్చ తెలుగు అమ్మాయే. 2020లో మిస్ ఇండియాగా నిలిచిన మానసకు తొలి చిత్రం ‘దేవకీ నందన వసుదేవ’ నిరాశ మిగిల్చినా.. ‘కపుల్ ఫ్రెండ్లీ’ మాత్రం మంచి బ్రేక్ ఇచ్చింది. ఇందులో తన అందం, అభినయం కుర్రాళ్లను కట్టిపడేస్తోంది.

ఇంకోవైపు ‘కోర్టు’ అమ్మాయి శ్రీదేవి కూడా బిజీ అయ్యేలా కనిపిస్తోంది. ‘బ్యాండ్ మేళం’తో ఆమె త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే చాందిన చౌదరి, ఈషా రెబ్బా, అనన్య నాగళ్ళ లాంటి తెలుగమ్మాయిలు ఇండస్ట్రీలో కొనసాగుతుండగా.. ఇప్పుడు ఈ కొత్తమ్మాయిల కెరీర్ ప్రామిసింగ్‌గా కనిపిస్తోంది.

This post was last modified on February 16, 2026 12:35 pm

Share

Recent Posts

యువతుల పిచ్చి… ఫోటోకి లక్ష రూపాయలా?

చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…

1 hour ago

13 కోట్ల ఓట్లు ఎవరి అనుమతితో తొలగించారు?

కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…

4 hours ago

ట్రబుల్ తట్టుకుని నిలబడుతుందా

రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…

4 hours ago

గరివిడి లక్ష్మి చేస్తోంది పెద్ద సాహసమే

దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…

4 hours ago

అద్భుత ప్రయోగాల నిలయం ‘సింగీతం’

లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…

5 hours ago

ఒక్క పిల్ల‌ర్‌పైనే వైసీపీ భారం… !

వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న పార్టీ. ఈ పార్టీ ప్ర‌భావం నానాటికి త‌గ్గిపోతోంద‌న్న వాద‌న ఒక‌వైపు…

7 hours ago